గీతా ఆర్ట్స్‌పేరులో గీతా అంటే ఎవరో తెలుసా.? అసలు విషయం చెప్పిన అల్లు అరవింద్
గీతా ఆర్ట్స్ పేరు వెనుక గీత ఎవరు అనే సందేహం చాలామందిలో ఉంటూనే ఉంటుంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈ విషయంపై స్పష్టతనిచ్చారు. గీత ఆర్ట్స్ పేరు వెనక ఉన్న అసలు కథను కూడా వివరించారు

టాలీవుడ్ టాప్ నిర్మాతల్లో అల్లు అరవింద్ ఒకరు. అల్లు అరవింద్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలను ప్రేక్షకులకు అందించారు. గీత ఆర్ట్స్ పథకం పై చాలా సినిమాలను నిర్మించి ప్రేక్షకులను అలరించారు అల్లు అరవింద్. గీతా ఆర్ట్స్ తో పాటు గీతా ఆర్ట్స్ 2 పేరుతోనూ సినిమాలను నిర్మించారు అల్లు అరవింద్ చిన్న సినిమాలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో గీతా ఆర్ట్స్ 2 పేరుతో ఓ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి, కొత్త యాక్టర్స్, యంగ్ డైరెక్టర్స్ కు మంచి అవకాశాలు కల్పించారు. అలాగే ఎన్నో సినిమాలను నిర్మించారు అల్లు అరవింద్. 1974లో వచ్చిన బంట్రోతు భార్య అనే సినిమాతో గీత ఆర్ట్స్ ప్రయాణం మొదలైంది. అయితే అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్‌కు అసలు ఆ పేరు ఎందుకొచ్చిందో తెలుసా.? గీత ఆర్ట్స్‌లో గీత అంటే ఎవరో తెలుసా.?.గతంలో ఈ షయం పై ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గ మారాయి.
ప్రముఖ కమెడియన్ అలీ నిర్వహించిన ఓ ప్రోగ్రాం లో అల్లు అరవింద్ పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో అసలు గీతా ఆర్ట్స్ అని ఎందుకు పేరు పెట్టారు.. గీత అంటే ఎవరు అని అలీ అడిగారు. దానికి అల్లు అరవింద్ సమాధానమిస్తూ. గీతా అన్నది తన గర్ల్‌ఫ్రెండ్ పేరు అని కొందరు భావిస్తున్నారని, ఆ సందేహాన్ని క్లారిటీ ఇచ్చారు. నిజానికి, తనకు గీత అనే గర్ల్‌ఫ్రెండ్ ఉన్నప్పటికీ, నిర్మాణ సంస్థ పేరుకు దానికి సంబంధం లేదని అరవింద్ సరదాగా పేర్కొన్నారు. ఈ పేరును తన తండ్రి, దివంగత అల్లు రామలింగయ్య గారు సూచించారని అల్లు అరవింద్ వెల్లడించారు.
తన తండ్రి, పార్టనర్లు దాసరి సత్యనారాయణ మూర్తి, వేగి వీర్రాజు సమక్షంలో “గీతా ఆర్ట్స్” అనే పేరును ప్రతిపాదించారని తెలిపారు. భగవద్గీత సారాంశం “ప్రయత్నం మాత్రమే మనది, ఫలితం మన చేతిలో లేదు” అన్నది సినిమా నిర్మాణానికి చక్కగా వర్తిస్తుందని, అందుకే ఈ పేరును ఎంచుకున్నారని వివరించారు. నిర్మాతగా తన పని ప్రయత్నం చేయడమే తప్ప, ఫలితం ప్రేక్షక దేవుళ్ల చేతుల్లో ఉంటుందనేది ఈ పేరులోని అంతరార్థం. పెళ్లి తర్వాత నిర్మల ఆర్ట్స్ అని పేరు మార్చొచ్చు కదా అన్న సరదా ప్రశ్నకి, అప్పటికే సంస్థ విజయవంతంగా సినిమాలు నిర్మిస్తున్నందున మార్చాల్సిన అవసరం రాలేదని అరవింద్ బదులిచ్చారు. ఈ విధంగా, గీతా ఆర్ట్స్ పేరు వెనుక ఒక గొప్ప తాత్విక అర్థం ఉందని స్పష్టమైంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
