Nandhi Trailer: మ‌హేష్ బాబు చేతుల‌మీదుగా ‘నాంది’ ట్రైల‌ర్.. స‌రికొత్త కోణంలో ఆల‌రించ‌న‌నున్న న‌రేష్..

Nandhi Trailer: కామెడీ సినిమాలతో అభిమానులను అలరించే అల్లరి నరేశ్ తొలిసారిగా సీరియస్ పాత్రను పోషిస్తున్నారు. తన కొత్త సినిమా నాందిలో సరికొత్త

Nandhi Trailer: మ‌హేష్ బాబు చేతుల‌మీదుగా నాంది ట్రైల‌ర్.. స‌రికొత్త కోణంలో ఆల‌రించ‌న‌నున్న న‌రేష్..

Edited By: Rajeev Rayala

Updated on: Feb 06, 2021 | 3:32 PM

Nandhi Trailer: కామెడీ సినిమాలతో అభిమానులను అలరించే అల్లరి నరేశ్ తొలిసారిగా సీరియస్ పాత్రను పోషిస్తున్నారు. తన కొత్త సినిమా నాందిలో సరికొత్త కోణంలో కనిపించనున్నారు. ఇప్పటికే క్యారెక్టర్ ఆర్టిస్టుగా అద్భుతమైన పాత్రలలో నటించిన నరేశ్ ఇప్పడు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీతో అభిమానుల ముందుకు రాబోతున్నాడు. విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కించిన నాంది సినిమా ట్రైలర్ విడుదలై నెట్టింట్లో హల్‌చల్ చేస్తుంది.

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా విడుదల కాబడిన ఈ టీజర్ చాలా ప్రామిసింగ్ గా ఉందని చెప్పాలి. అంతే కాకుండా ఇందులో లైన్ కూడా ఆసక్తికరంగా అనిపిస్తుంది. అసలు తనకు సంబంధం లేని ఓ కేసులో ఇరుక్కున్న అమాయకుడు జైలులో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు ఏమయ్యాడు అన్న లైన్ లో కనిపిస్తుంది. మరి దీనిని అంతే అద్భుతంగా నరేష్ హ్యాండిల్ చేసాడు. అలాగే ఆ పాత్రలో తన నటనా పరిపూర్ణత చాలా బాగా కనిపిస్తుంది. అలాగే నరేష్ లాయర్ గా టాలెంటెడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ మంచి రోల్ లో కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. ఇక అలాగే సిడ్ సినిమాటోగ్రఫీ చాలా నాచురల్ గా కనిపిస్తుంది. శ్రీ చరణ్ పాకల బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ ట్రైలర్ కు మరో అదనపు ఆకర్షణగా నిలిచింది.అలాగే సీనియర్ దర్శకుడు సతీష్ వేగేశ్న గారి నిర్మాణ విలువలు అత్యుత్తమంగా ఉన్నాయి. ఫిబ్రవరి 19 న ఈ సినిమా విడుదల కాబోతుంది.

Signing of Blank Documents: వ్యాపారిని బెదిరించి ఖాళీ పత్రాలపై సంతకాలు.. పోలీసుల దర్యాప్తులో అసలు నిజాలు..