Allari Naresh’s ‘Bangaru Bullodu’ : వివాదంలో చిక్కుకున్న అల్లరి నరేష్ ‘బంగారు బుల్లోడు’ సినిమా..

అల్లరి నరేష్‌ హీరోగా నటించిన బంగారు బుల్లోడు సినిమా వివాదంలో చిక్కుకుంది. ఈనెల 23న విడుదల కానున్న సినిమా ట్రయల్‌ దుమారం రేపుతోంది. అందులో స్వర్ణకారులకు సంబంధించిన సీన్స్

Allari Nareshs Bangaru Bullodu : వివాదంలో చిక్కుకున్న అల్లరి నరేష్ బంగారు బుల్లోడు సినిమా..

Updated on: Jan 22, 2021 | 5:38 AM

Allari Naresh’s ‘Bangaru Bullodu’ : అల్లరి నరేష్‌ హీరోగా నటించిన బంగారు బుల్లోడు సినిమా వివాదంలో చిక్కుకుంది. ఈనెల 23న విడుదల కానున్న సినిమా ట్రయల్‌ దుమారం రేపుతోంది. అందులో స్వర్ణకారులకు సంబంధించిన సీన్స్‌.. అభ్యంతరకరంగా ఉన్నాయంటూ స్వర్ణకార సంఘాల నేతలు మండిపడుతున్నారు.

ఒకరి బంగారు వస్తువులకు ఇంకొకరి ఇస్తున్నట్టుగా చూపిస్తూ తమ వృత్తిని కించపరిచారని స్వర్ణకార సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఇంకా సినిమాలో అలాంటి అభ్యంతరకరమైన సన్నివేశాలేమైనా ఉన్నాయో చూసి చర్యలు తీసుకోవాలంటూ ఫిలించాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రతినిధులకు ఫిర్యాదు చేశారు. తమ వృత్తిపై నిందులు మోపేలా ఏ సీన్‌ ఉన్నా తొలగించాల్సిందేనన్నారు. సినిమా విడుదలకు ముందు.. తమకు ప్రివ్యూ వేయాలన్నారు. లేని పక్షంలో తెలుగురాష్ట్రాల్లో బంగారుబుల్లోడు సినిమా విడుదలను అడ్డుకుంటామని హెచ్చరించారు.

సినిమాలో హీరోను స్వర్ణకారుడిగా చూపించినందుకు ధన్యవాదాలు చెబుతూనే.. అభ్యంతరకర సన్నివేశాలను మాత్రం సహించమని అంటున్నారు. ప్రస్తుతం పూటగడవని పరిస్థితుల్లో స్వర్ణకారులు ఉన్నారని, కొందరు బ్యాంకుల్లో అప్రైజర్లుగా నమ్మకంగా జీవిస్తున్నారని అన్నారు. అలాంటి తరుణంలో స్వర్ణకారులపై నమ్మకంపోయేలా ట్రయల్‌లో సీన్లున్నాయన్నారు. స్వర్ణకారుల మేలుకోరి ఆ సన్నివేశాలను తొలగించాలని డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో.. నిర్మాత ఎలా రియాక్ట్ అవుతారన్నది చూడాల్సి ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

క్రేజీ కాంబినేషన్ నుంచి అప్‏డేట్.. కేజీఎఫ్ హీరోతో కలిసి భారీ చారిత్రాత్మక సినిమా తీయనున్న శంకర్ ?