OTT Movie: ఇట్స్ అఫీషియల్.. అప్పుడే ఓటీటీలోకి అక్కినేని సుమంత్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. IMDBలో 9.3 రేటింగ్
అక్కినేని సుమంత్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'న్యూటన్స్ థర్డ్ లా'. క్రైమ్ థ్రిల్లర్ జానర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే థియేటర్లలో విడుదలైంది. కమర్షియల్ గా వర్కవుట్ కాకపోయినా ఈ సినిమా లో ఆడియెన్స్ కు నచ్చే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి.

జయపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు అక్కినేని సుమంత్. అయితే ఈ హీరో సినిమా వచ్చిందంటే కచ్చితంగా అందులో ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది. అలా అక్కినేని సుమంత్ నటించిన లేటెస్ట్ సినిమా ‘న్యూటన్స్ థర్డ్ లా’. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా జులై 31న థియేటర్లలో రిలీజై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. రొటీన్ క్రైమ్ కథలకు భిన్నంగా ‘కర్మ’ కాన్సెప్టును క్రైమ్ థ్రిల్లర్ కు జోడించి సినిమాను మలిచిన విధానం ఆడియెన్స్ ను మెప్పించింది. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన న్యూటన్స్ థర్డ్ లా సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ శుక్రవారం (ఆగస్టు 28) నుంచి సుమంత్ సినిమా స్ట్రీమింగ్ కు రానుంది. ఈ విషయాన్ని తాజాగా నెట్ ఫ్లిక్స్ అధికారికంగా వెల్లడించింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులోకి రానుంది.
‘న్యూటన్స్ థర్డ్ లా’ సినిమా విషయానికి వస్తే.. దర్శకుడు రాజేష్ కర్ణ ఈ సినిమాను తెరకెక్కించారు. సుమంత్ తో పాటు జగపతి బాబు, శ్రీనివాస్ అవసరాల, రవి వర్మ, అవసరాల శ్రీనివాస్, షెల్లీ ఎన్ కుమార్, త్రినాథ్ వర్మ, నేహా పఠాన్, రూపేశ్ మార్రపు, హరిణి రావు, అభినయన, పండిట్ గౌతమ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈటీవీ విన్ సమర్పణలో హరీశ్ కొహిర్కర్ ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను నిర్మించారు. సింజిత్ యర్రమిల్లి ఈ సినిమాకు సంగీతం అందించారు. ఈ మధ్యన థియేటర్లలో పెద్దగా ఆడని సినిమాలు కూడా ఓటీటీలో దుమ్మురేపుతున్నాయి. మరీ ముఖ్యంగా సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాల విషయంలో ఇది ఎక్కువగా జరుగుతోంది. మరి అక్కినేని సుమంత్ నటించిన ‘న్యూటన్స్ థర్డ్ లా’ సినిమాకు కూడా ఓటీటీలో మంచి రెస్పాన్స్ వస్తుందేమో చూడాలి.
నెట్ ఫ్లిక్స్ లో అక్కినేని సుమంత్ న్యూటన్స్ థర్డ్ లా..
Siksha leni crime ledhu, mugimpu leni criminal ledu 🔪🕵️♀️ pic.twitter.com/9wY9GMzuHg
— Netflix India South (@Netflix_INSouth) August 25, 2026
అక్కినేని సుమంత్ న్యూటన్స్ థర్డ్ లా సినిమా ట్రైలర్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




