Nagarjuna Akkineni: నాంపల్లి కోర్టుకు అక్కినేని నాగార్జున.. ఇవాళ ఏం జరగనుందంటే..

|

Oct 08, 2024 | 10:52 AM

మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే. తనపై సోషల్‌ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన సురేఖ… బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు కౌంటర్‌ ఇచ్చే క్రమంలో.. అక్కినేని కుటుంబంతో లింక్‌పెడుతూ చేసిన కామెంట్స్‌ చేశారు.

Nagarjuna Akkineni: నాంపల్లి కోర్టుకు అక్కినేని నాగార్జున.. ఇవాళ ఏం జరగనుందంటే..
Nagarjuna, Konda Surekha
Follow us on

మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే. తనపై సోషల్‌ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన సురేఖ… బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు కౌంటర్‌ ఇచ్చే క్రమంలో.. అక్కినేని కుటుంబంతో లింక్‌పెడుతూ చేసిన కామెంట్స్‌ చేశారు. అక్కినేని నాగార్జున కుటుంబాన్ని, వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. అయితే కొండా సురేఖ కామెంట్స్‌పై నాంపల్లి కోర్టులో పరువునష్టం దావా వేశారు. అక్కినేని నాగార్జున. మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరడంతో పాటు వందకోట్లకు పరువు నష్టం దావా వేశారు. నాగార్జున.. అయితే.. మంత్రి కొండా సురేఖపై సినీ నటుడు నాగార్జున వేసిన పరువు నష్టం పిటిషన్‌పై నాంపల్లి కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. నాగార్జున తరపున సీనియర్ కౌన్సిల్ అశోక్ రెడ్డి వాదనలు వినిపించారు. పిటిషనర్ నాగార్జున స్టేట్‌మెంట్‌ను మంగళవారం రికార్డ్ చేస్తామని ధర్మాసనం తెలిపింది. నాగార్జునతో పాటు సాక్షుల వాంగ్మూలాలను కూడా నమోదు చేయాలని కోరారు ఆయన తరపు న్యాయవాది అశోక్ రెడ్డి. దీంతో విచారణను ఈ రోజుకు వాయిదా వేసింది నాంపల్లి కోర్టు.. ఈ నేపథ్యంలో ఇవాళ అక్కినేని నాగార్జున నాంపల్లి కోర్టులో హాజరుకానున్నారు. నాగార్జున స్టేట్‌మెంట్ ను ధర్మాసనం రికార్డు చేయనుంది. కొండా సురేఖపై క్రిమినల్ చర్యలతో పాటు.. రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేసిన నాగార్జున.. ఇవాళ కోర్టులో ఎలాంటి స్టేట్ మెంట్ ఇస్తారు.. ఈ వ్యవహారంలో కోర్టు ఏ విధంగా స్పందిస్తుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకుంది.

జరిగిందిదే..

బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీమంత్రి కేటీఆర్‌ను విమర్శించే క్రమంలో.. సినీ నటుడు అక్కినేని నాగార్జున కుటుంబాన్ని, వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ మంత్రి కొండా సురేఖ ఇటీవల పలు వ్యాఖ్యలు చేశారు. నాగచైతన్య సమంతా విడాకులకు కేటీఆర్ కారణమంటూ ఆరోపించారు.. దీనిపై అక్కినేని కుటుంబం, సమంతతో పాటు రాజకీయ, సినీ ప్రముఖులు తీవ్రంగా స్పందించారు. కొండా సురేఖ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు మంత్రి కొండా సురేఖ.. ఈ క్రమంలోనే.. నాగార్జున కోర్టులో పిటిషన్ వేయడం సంచలనంగా మారింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..