22 ఏళ్ల తరువాత కలిసి నటించనున్న ‘జీన్స్’ జంట..!

ప్రశాంత్‌, ఐశ్వర్యరాయ్‌లు హీరో హీరోయిన్లుగా స్టార్ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన జీన్స్‌ని సినీ ప్రేక్షకులు ఎవ్వరూ అంత ఈజీగా మర్చిపోరు

  • Tv9 Telugu
  • Publish Date - 10:12 am, Wed, 14 October 20
22 ఏళ్ల తరువాత కలిసి నటించనున్న 'జీన్స్' జంట..!

Jeans pair reunite: ప్రశాంత్‌, ఐశ్వర్యరాయ్‌లు హీరో హీరోయిన్లుగా స్టార్ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన జీన్స్‌ని సినీ ప్రేక్షకులు ఎవ్వరూ అంత ఈజీగా మర్చిపోరు. 1998లో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో ఘన విజయం సాధించి రికార్డులు సృష్టించింది. అంతేకాదు నటిగా ఐశ్వర్యరాయ్‌ని‌ బిజీ అయ్యేలా చేసిన చిత్రం ఇది. ఇదిలా ఉంటే అన్నీ కుదిరితే ఈ జీన్స్ జంటను మళ్లీ తెరపై చూసే అవకాశం వస్తుంది.

బాలీవుడ్‌లో ఆయుష్మాన్ ఖురానా నటించిన అంధధూన్‌ని పలు భాషల్లో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ మూవీ తమిళ రీమేక్ హక్కులను ప్రశాంత్‌ తండ్రి, నిర్మాత తియగరాజన్ కొనుగోలు చేశారు. ఇక ఈ రీమేక్ పనులు ప్రస్తుతం జరుగుతుండగా.. మాతృకలో టబు నటించిన పాత్రకు గానూ ఐశ్వర్యరాయ్‌ని సంప్రదించారట. ఈ విషయాన్ని తియగరాజన్ తెలిపారు.

ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఇందులో టబు పాత్ర కోసం ఐశ్వర్యరాయ్‌తో చర్చలు జరుపుతున్నాం. కానీ ఇంతవరకు ఆమె నుంచి సమాధానం రాలేదు. ఒకవేళ తను ఓకే చెబితే 22 సంవత్సరాల తర్వాత ప్రశాంత్‌, ఐశ్వర్యలు మళ్లీ కలిసి పని చేస్తారు అని తియగరాజన్ పేర్కొన్నారు. మరి ఈ మూవీపై ఐశ్వర్య అభిప్రాయం ఎలా ఉందో చూడాలి.

కాగా మరోవైపు తెలుగులోనూ అంధధూన్‌ని రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో నితిన్ హీరోగా నటిస్తున్నారు. టబు పాత్రలో తమన్నా, రాధికా ఆప్టే పాత్రలో నభా నటేష్ నటించనున్నారు. శ్రేష్ట్ మూవీస్ నిర్మిస్తోన్న ఈ మూవీకి మహతి స్వర సాగర్ సంగీతాన్ని అందించనున్నారు. నవంబర్‌ నుంచి ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది.

Read More:

మరో అవతారం ఎత్తబోతున్న రజనీకాంత్‌..!

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 1,446 కొత్త కేసులు.. 8 మరణాలు