ప్రముఖ డైరెక్టర్ మణిరత్నం ఓ హిస్టారికల్ సినిమాని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని మద్రాస్ టాకీస్, రిలయన్స్ ఎంటర్ టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి. ‘పొన్నియన్ సెల్వన్’ నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు మణిరత్నం. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, జయం రవి, అనుష్క, కీర్తీ సురేష్ నటించబోతున్నారు. అయితే.. ఈ సినిమాలో విలన్ పాత్రలో ప్రముఖ హీరోయిన్ ఐశ్వర్యారాయ్ నటించబోతున్నట్లు సమాచారం. విలన్ పాత్రే సినిమాలోని కథను మలుపు తిప్పుతుందని.. ఈ పాత్రకు ఐశ్వర్య అయితే సరిగ్గా సరిపోతుందని.. అందుకే మణిరత్నం ఐష్‌ని సంప్రదించారన్న వార్తలు ప్రస్తుతం చెక్కర్లు కొడుతున్నాయి. ఈ పాత్రకు ఐశ్వర్యా రాయ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. అయితే.. ఇది నిజమో, కాదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.