Telugu Indian Idol: సరదా సరదాగా ఆహా ఇండియన్‌ ఐడల్‌.. మార్చి 10వ తేదీన లేటెస్ట్ ఎపిసోడ్‌ స్ట్రీమింగ్‌.

|

Mar 09, 2023 | 5:27 PM

తొలి తెలుగు ఓటీటీ ఆహాలో ప్రసారమయ్యే ఇండియన్‌ ఐడల్‌కి మంచి ఆదరణ లభిస్తోంది. యంగ్ సింగర్స్‌ ట్యాలెంట్‌ను ప్రపంచానికి పరిచయం చేస్తున్న ఈ షో ప్రేక్షకులకు ఆకట్టుకుంటోంది. తొలి సీజన్‌ సక్సెస్‌...

తొలి తెలుగు ఓటీటీ ఆహాలో ప్రసారమయ్యే ఇండియన్‌ ఐడల్‌కి మంచి ఆదరణ లభిస్తోంది. యంగ్ సింగర్స్‌ ట్యాలెంట్‌ను ప్రపంచానికి పరిచయం చేస్తున్న ఈ షో ప్రేక్షకులకు ఆకట్టుకుంటోంది. తొలి సీజన్‌ సక్సెస్‌ కావడంతో రెండో సీజన్‌ను ఇటీవల ప్రారంభించారు. ఇక సెకండ్‌ సీజన్‌లో మ్యూజిక్ డైరెక్టర్ తమన్, సింగర్ గీతా మాధురితో పాటు.. సింగర్ కార్తీక్ జడ్జీలుగా వ్యహరిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మొదటి, రెండో ఎపిసోడ్‌ స్ట్రీమింగ్ అవుతుండగా.. మేకర్స్‌ తదుపరి ఎపిసోడ్స్‌ని మార్చి 10, 11 తేదీల్లో స్ట్రీమింగ్‌ చేయనున్నారు.

ఇందులో భాగంగానే తాజా ప్రోమోను విడుదల చేశారు. ప్రోమో చూస్తుంటే ఈ ఎపిసోడ్స్‌ సరదాగా సాగినట్లు అర్థమవుతోంది. ముఖ్యంగా గీతామాధురి, తమన్‌ల మధ్య జరిగిన ఫన్నీ కన్వర్జేషన్‌ ఆకట్టుకుంటోంది. మరి మూడు, నాలుగో ఎపిసోడ్‌ ప్రేక్షకులను ఏమేర ఆకట్టుకుంటుంది. సింగర్స్‌ తమ గాత్రంతో ఎలాంటి మ్యాజిక్‌ చేస్తారో చూడలంటే ఒక రోజు ఆగాల్సిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..