Aevum Jagat Teaser: ‘ఇది కలాం కలలు కన్న దేశం కాదు.. బాపు సాధించిన స్వతంత్రం కాదు’.. ఆసక్తికరంగా ఏవం జగత్‌ టీజర్‌.

|

Nov 06, 2021 | 7:03 AM

Aevum Jagat Teaser: ఇటీవల కమర్షియల్‌ సినిమాలే కాకుండా కాన్సెప్ట్‌ ఓరియంటెడ్‌ చిత్రాలను సైతం ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. మంచి కథ ఉండాలే కానీ చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా మంచి...

Aevum Jagat Teaser: ఇది కలాం కలలు కన్న దేశం కాదు.. బాపు సాధించిన స్వతంత్రం కాదు.. ఆసక్తికరంగా ఏవం జగత్‌ టీజర్‌.
Aevum Teaser
Follow us on

Aevum Jagat Teaser: ఇటీవల కమర్షియల్‌ సినిమాలే కాకుండా కాన్సెప్ట్‌ ఓరియంటెడ్‌ చిత్రాలను సైతం ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. మంచి కథ ఉండాలే కానీ చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా మంచి మార్కులు పడుతున్నాయి. దీంతో దర్శక, నిర్మాతలు సైతం అలాంటి సినిమాలకు మొగ్గు చూపుతున్నారు. ఈ జాబితాలోకే వస్తుంది తాజాగా తెరకెక్కుతోన్న ‘ఏం జగత్‌’ అనే చిత్రం. దినేష్‌ నర్రా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కొత్త వారే నటిస్తున్నారు. కిరణ్ గేయ, ప్రకృతివనం ప్రసాద్, రిటైర్డ్ బ్రిగేడియర్ గణేషమ్, ఇనయ సుల్తానా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని మణిరత్నం నాయుడు, రాశేశ్వరి నిర్మిస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ప్రముఖ దర్శకుడు దేవకట్ట ఈ టీజర్ ను విడుదల చేశారు.  1:45 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా టీజర్‌ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. టీజర్‌ను గమనిస్తే సినిమా మంచి వినూత్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కినట్లు కనిపిస్తోంది. ఉద్యోగం కోసం గ్రామాన్ని వదిలేసి వేరే చోటుకు వెళ్లాలనుకునే యువకుని చుట్టూ తిరిగే కథలా అనిపిస్తోంది. ఇక మనుషుల మధ్య ఉండే బంధాలు, అనుబంధాలను ఇందులో దర్శకుడు ప్రస్తావించినట్లు టీజర్‌ను చూస్తే అర్థమవుతోంది.

ముఖ్యంగా టీజర్‌లో వచ్చే.. ‘ఇది కలాం కలలు కన్న దేశం కాదు.. బాపు సాధించిన స్వతంత్రం కాదు.. రాజ్యాంగం నేర్పించిన పరిపాలన కాదు..’ ‘ధన రాశులు కాదు మనిషికి మనిషే తోడు’ అనే డైలాగ్‌లు టీజర్‌పై అంచనాలు పెంచేశాయి. ఇక సినిమాలో కనిపించే పాత్రలు సైతం అత్యంత సహజంగా ఉండడంతో ఈ సినిమా సమ్‌థింగ్‌ స్పెషల్‌గా ఉందన్న భావన వీక్షకుల్లో కలుగుతోంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే విడుదల వరకు వేచి చూడాల్సిందే.

Also Read: Children Health: తల్లిపాలతో న్యుమోనియాకు చెక్‌.. పిల్లల్లో ఆ వ్యాధులు రాకుండా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి!

Gold Price Today: షాకిస్తున్న బంగారం ధరలు.. కొన్ని ప్రాంతాల్లో పెరిగితే.. మరి కొన్ని చోట్ల తగ్గింది.. ఎక్కడెక్కడ అంటే..

Sugar Price: అక్కడ పెట్రోల్‌ కంటే చక్కెర ధర రికార్డ్‌ స్థాయిలో.. కిలో పంచదార రూ.150