యంగ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్రలో నూతన దర్శకుడు జి.వెంకట్ రామ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఎవరు’. ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను ఇవాళ చిత్ర యూనిట్ విడుదల చేసింది. పోలీస్ యూనిఫారంలో ఉన్న అడివిశేషుకు ఎదురుగా రక్తం అంటిన గాజు ముక్కను పట్టుకొని రెజీనా కసాండ్రా నిల్చొని ఉన్న ఫస్ట్ లుక్ పోస్టర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది.
సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నవీన్ చంద్ర, మురళి శర్మ ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు. ఈ సినిమాను పీవీపీ బ్యానర్ పై పరం వి పొట్లూరి నిర్మిస్తున్నారు. కాగా ‘క్షణం’, ‘గూఢచారి’ సినిమాలతో భారీ హిట్స్ అందుకున్న శేష్‌కు ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో వేచి చూడాలి.
The Truth has One Face. A Lie has Many.
All Answers Shall Be Questioned THIS AUGUST#Evaru #EvaruFirstLook
Directed by @ramjivv@AdiviSesh @reginacassandra @Naveenc212 @murlisharma72 @abburiravi @SricharanPakala @Garrybh88 @Vamsi_P1988 @PVPCinema pic.twitter.com/iAs82fsW7Z
— BARaju (@baraju_SuperHit) July 11, 2019