Major Collections: బాక్సాఫీస్‌ వద్ద మేజర్‌ హవా.. మొదటి వారంలో ఎంత రాబట్టిందంటే..

Major Collections: 26/11 ముంబై మారణహోమంలో అసువులు బాసిన మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవిత కథ ఆధారంగా రూపొందిన చిత్రం మేజర్‌ (Major). యంగ్‌ హీరో అడివి శేష్ (Adivi Sesh) మేజర్‌ సందీప్‌ పాత్రలో నటించాడు.

Major Collections: బాక్సాఫీస్‌ వద్ద మేజర్‌ హవా.. మొదటి వారంలో ఎంత రాబట్టిందంటే..
Major Movie

Updated on: Jun 10, 2022 | 8:17 PM

Major Collections: 26/11 ముంబై మారణహోమంలో అసువులు బాసిన మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవిత కథ ఆధారంగా రూపొందిన చిత్రం మేజర్‌ (Major). యంగ్‌ హీరో అడివి శేష్ (Adivi Sesh) మేజర్‌ సందీప్‌ పాత్రలో నటించాడు.శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించాడు. సయీ మంజ్రేకర్‌, శోభిత ధూళిపాళ హీరోయిన్స్‌గా నటించగా, ప్రకాశ్‌ రాజ్‌, రేవతి కీలక పాత్రలు పోషించారు. సోనీ పిక్చర్స్‌ ఇంట‌ర్నేష‌న‌ల్ ప్రొడ‌క్షన్స్‌ బ్యానర్‌పై, జి మ‌హేష్‌బాబు ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. జూన్‌3న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుంచే హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. దేశభక్తి ప్రధానంగా రూపొందిన ఈ సినిమాను చూసి ప్రేక్షకులు భావోద్వేగానికి లోనవుతున్నారు. ఈక్రమంలో మేజర్‌ సినిమాకు భారీగా కలెక్షన్లు వస్తున్నాయి. విడుదలైన తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.13.10 కోట్ల గ్రాస్‌ సాధించిన ఈ చిత్రం వారం రోజుల్లోనే రూ.50.7 కోట్ల గ్రాస్‌ రాబట్టింది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించి ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసిన హీరో శేష్‌.. ఇది తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ అని అందులో రాసుకొచ్చాడు. తన తన గత సినిమాల కంటే మేజర్‌ మూడు రెట్లు ఎక్కువ కలెక్షన్స్‌ రాబట్టిందని హర్షం వ్యక్తం చేశాడు.

కాగా ప్రముఖ రేటింగ్ సంస్థ IMDB మేజర్ మూవీకి 9.2 / 10 రేటింగ్ ఇవ్వడం విశేషం. గతంలో అడివి శేష్ నటించిన గూఢచారి మూవీకి కూడా 7.8/10 రేటింగ్ ఇచ్చింది. ఇదిలా మేజర్‌ ఈ సినిమా ఓటీటీ విషయంలో అప్పుడే ఓ క్లారిటీ వచ్చింది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. మేజర్ సినిమా తెలుగుతో పాటు హిందీ, మలయాళం భాషాల్లో నెట్‌ఫ్లిక్స్‌లో థియేటర్‌‌లోకి వచ్చిన 50 రోజులకు అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

Ranji Trophy 2022: రంజీ ట్రోఫీలో అదరగొట్టిన క్రీడా మంత్రి.. ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో సరికొత్త రికార్డు..

Pawan Kalyan: పవర్‌స్టార్‌ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ .. క్లారిటీ ఇచ్చిన స్టార్‌ డైరెక్టర్‌.. ఇలాంటివి పోస్ట్‌ చేసేముందు అంటూ..

Tirumala: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. రేపటి నుంచి జ్యేష్టాభిషేకం టికెట్ల బుకింగ్‌.. పూర్తి వివరాలివే..

Loading...
Unable to load recommendations.
Follow Us