‘Acharya’ Movie : ‘ఆచార్య’ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు.. ఆడియో హక్కులు దక్కించుకున్న ఆదిత్య మ్యూజిక్

మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘ఆచార్య’ చిత్రబృందం నుంచి స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ వచ్చేసింది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఈ సినిమా టీజర్‌ను ఇటీవల విడుదల చేశారు చిత్రయూనిట్.

'Acharya' Movie : 'ఆచార్య' కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు.. ఆడియో హక్కులు దక్కించుకున్న ఆదిత్య మ్యూజిక్
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 03, 2021 | 8:40 PM

‘Acharya’ Movie : మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘ఆచార్య’ చిత్రబృందం నుంచి స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ వచ్చేసింది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఈ సినిమా టీజర్‌ను ఇటీవల విడుదల చేశారు చిత్రయూనిట్. ఈ టీజర్ రికార్డులు క్రియేట్ చేస్తుంది. ‘ఆచార్య’లో చిరంజీవి సరసన కాజల్‌ హీరోయిన్ గా సందడి చేయనుంది. ఇందులో రామ్‌చరణ్‌ సిద్ధగా కీలకపాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. చరణ్‌కు జోడీగా పూజాహెగ్డే నటించనున్నట్లు తెలుస్తోంది.

మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, కొణిదెల ప్రొడెక్షన్స్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి రామ్‌చరణ్‌, నిరంజన్‌ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా చివరిదశలో ఉంది. మెగాస్టార్ – మణిశర్మ కాంబినేషన్ ఆల్బమ్ మ్యూజిక్ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా ఆడియో హక్కులను ఆదిత్య మ్యూజిక్ వారు దక్కించుకున్నారు. ‘ఆచార్య’ కోసం దాదాపు నాలుగు కోట్లవరకు వెచ్చించినట్లు ఇండస్ట్రీ టాక్. కాగా ‘ఆచార్య’ మూవీ వేసవి కానుకగా మే 13న థియేటర్లలో విడుదల కాబోతుంది. ఈ సినిమా పై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

బాలీవుడ్‌‌‌‌‌కు తాకిన విజయ్ సేతుపతి స్టార్‌‌‌‌డమ్.. వెబ్‌‌‌‌సిరీస్ కోసం భారీగా డిమాండ్ చేసిన మక్కల్ సెల్వన్.. !

‘F3’ Movie : శరవేగంగా ‘ఎఫ్ 3’ షూటింగ్.. సెట్‌‌‌‌లోకి అడుగు పెట్టిన కోబ్రో .. వెల్కమ్ చెప్పిన డైరెక్టర్