Adavallu Meeku Joharlu: శర్వానంద్ (sharwanand), రష్మిక మందన్న (Rashmika) జంటగా తెరకెక్కుతోన్న సినిమా ఆడవాళ్లు మీకు జోహార్లు.. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా సినిమాలోని పాటలు, టీజర్‌లు ఒక్కసారిగా క్యూరియాసిటీ పెంచేశాయి. తిరుమల కిషోర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మార్చి 04న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే విడుదల తేదీ దగ్గరపడుతోన్న నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ విషయంలో దృష్టి సారించిన సినిమా యూనిట్.. ప్రచారరంలో స్పీడ్‌ను పెంచింది. ఈ క్రమంలోనే ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనుంది. ఫిబ్రవరి 27న హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఈవెంట్‌ను నిర్వహిస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
ఇదిలా ఉంటే ఈ వేడుకకు చిత్ర యూనిట్ భారీ తారగణాన్ని ఆహ్వానించింది. స్టార్ హీరోయిన్లు కీర్తి సురేష్, సాయి పల్లవి ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. అలాగే దర్శకుడు సుకుమార్ కూడా ఈవెంట్‌కు రానున్నారు. సినిమా ట్రైలర్‌ను కీర్తి సురేష్, సాయి పల్లవి కలిసి లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈవెంట్‌పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
Even sukku sir is cheif guest..
Now it’s gonna be more interesting?#AadavalluMeekuJoharlu #amjonmarch4th #rashmikamandanna❤️ pic.twitter.com/0W4fX7puJ5— Ankitha_kr? (@KrAnkitha) February 25, 2022
ఇదిలా ఉంటే ఈ సినిమాలో రాధికా శరత్‌కుమార్, ఖుష్బు, ఊర్వశి వంటి సీనియర్ హీరోయిన్‌లు నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తుండగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇప్పటికే సినిమాలోని పాటలు మంచి బజ్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
Also Read: Ram Charan: రామ్ చరణ్ సినిమాలో చిన్నపాత్రలో కనిపించనున్న స్టార్ హీరో..?