Yami Gautam: ఫేవర్‌ అండ్‌ లవ్లీ బ్యూటీ అందం అసలు సీక్రెట్‌ ఏంటో తెలుసా? యామీ చెప్పిన విశేషాలు..

Yami Gautam: యామీ గౌతమ్‌ నటిగా పరిచయం అయ్యే కంటే ముందే ఫెయిర్‌ అండ్‌ లవ్లీ క్రీమ్‌ యాడ్‌తో పాపులర్‌ అయిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ యాడ్‌తో ఎక్కడలేని క్రేజ్‌ను దక్కించుకుందీ బ్యూటీ...

Yami Gautam: ఫేవర్‌ అండ్‌ లవ్లీ బ్యూటీ అందం అసలు సీక్రెట్‌ ఏంటో తెలుసా? యామీ చెప్పిన విశేషాలు..
Yami Gautam

Updated on: Sep 05, 2022 | 6:20 AM

Yami Gautam: యామీ గౌతమ్‌ నటిగా పరిచయం అయ్యే కంటే ముందే ఫెయిర్‌ అండ్‌ లవ్లీ క్రీమ్‌ యాడ్‌తో పాపులర్‌ అయిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ యాడ్‌తో ఎక్కడలేని క్రేజ్‌ను దక్కించుకుందీ బ్యూటీ. నువ్విలా చిత్రంతో తొలిసారి తెలుగు ప్రేక్షకులకు పలకరించిన ఈ చిన్నది అనంతరం గౌరవం, కొరియర్‌ బాయ్‌ కళ్యాణ్‌ సినిమాలతో తెలుగు వారికి సుపరిచతమైంది. అయితే ఆ తర్వాత హిందీ చిత్రాలకే పరిమితమైంది.

ఇదిలా ఉంటే ప్రకటనలో తన అందానికి బ్యూటీ క్రీమ్‌ కారణమని చెప్పే యామీ నిజ జీవితంలో మాత్రం తనకు బ్యూటీ సీక్రెట్‌ ఏంటో చెప్పేసింది. తన అందానికి తన తల్లి చెప్పిన చిట్కానే కారణమని చెబుతోంది యామీ. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన యామీ.. ‘కొత్తగా గ్లో తెచ్చుకోవడం కంటే ఉన్న చర్మాన్ని ఎలా కాపాడుకోవడమెలా అనేదానిపైనే దృష్టి సారిస్తాను.

ఇందుకోసం అమ్మ చెప్పిన చిట్కానే ఇప్పటికీ ఫాలో అవుతున్నాను. బియ్యంపిండిలో పాలు కలిపి స్క్రబ్బర్‌లా ఉపయోగిస్తాను. ఇక తేనెలో గ్లిజరిన్‌, టీస్పూన్‌ నిమ్మరసం, రోజ్‌ వాటర్‌ కలిపి సాఫ్ట్‌గా మొహానికి అప్లై చేస్తాను. అది చర్మంలోనే తేమను కాపాడుతూ నిగనిగలాడేలా చేస్తుంది’ అని తన అసలు బ్యూటీ సీక్రెట్‌ ఏంటో చెప్పేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..