Varalaxmi Sarathkumar: కొవిడ్‌ బారిన వరలక్ష్మి.. వీడియో షేర్‌ చేసిన హీరోయిన్‌.. రాధిక ఏమన్నారంటే..

|

Jul 17, 2022 | 2:42 PM

Covid 19: ప్రముఖ నటి, హీరోయిన్‌ వరలక్ష్మి శరత్‌కుమార్‌ (Varalaxmi Sarathkumar) కొవిడ్‌ బారిన పడింది. కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని ఆదివారం ఉదయం ఆమె తెలిపింది. కరోనా మహమ్మారి ఇంకా మన చుట్టూనే తిరుగుతుందని..

Varalaxmi Sarathkumar: కొవిడ్‌ బారిన వరలక్ష్మి.. వీడియో షేర్‌ చేసిన హీరోయిన్‌.. రాధిక ఏమన్నారంటే..
Varalaxmi Sarathkumar
Follow us on

Covid 19: ప్రముఖ నటి, హీరోయిన్‌ వరలక్ష్మి శరత్‌కుమార్‌ (Varalaxmi Sarathkumar) కొవిడ్‌ బారిన పడింది. కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని ఆదివారం ఉదయం ఆమె తెలిపింది. కరోనా మహమ్మారి ఇంకా మన చుట్టూనే తిరుగుతుందని.. దయచేసి అందరూ కొవిడ్‌ నిబంధనలు పాటించాలని కోరుతూ ఆమె ఓ వీడియో విడుదల చేసింది. ‘అన్నిరకాల జాగ్రత్తలు పాటించినప్పటికీ నాకు కొవిడ్‌(Covid19) పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇటీవల నన్ను కలిసిన వారందరూ తగిన జాగ్రత్తలు తీసుకోండి. అవసరమైతే వైద్య పరీక్షలు కూడా చేయించుకోండి. అలాగే, షూటింగ్‌ సెట్‌లో ఉండే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించేలా పట్టుబట్టాలి. ఎందుకంటే నటీనటులు అన్నిసార్లు సెట్‌లో మాస్కులు ధరించలేరు. కాబట్టి చుట్టూ ఉన్నవాళ్లందరూ ఇకనైనా మాస్కులు ధరించాలి’ అని వీడియోలో కోరింది వరలక్ష్మి. కాగా వరలక్ష్మికి కరోనా సోకిందన్న విషయం తెలవగానే పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పోస్టులు పెడుతున్నారు.

జాగ్రత్త వరూ!

ఇవి కూడా చదవండి

ఇక వరలక్ష్మి పోస్టుపై తల్లి, నటి రాధిక స్పందిస్తూ.. ‘జాగ్రత్త వరూ.. నీకు మరింత ధైర్యం, బలం చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా’ అని మనోధైర్యం చెప్పుకొచ్చారు. కాగా ప్రముఖ కోలీవుడ్ నటుడు శరత్‌కుమార్‌ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది వరలక్ష్మి. హీరోయిన్‌గా, లేడీ విలన్‌, పవర్‌ఫుల్‌ క్యారెక్టర్లలో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక తెలుగులో తెనాలి రామకృష్ణ, క్రాక్‌, నాంది సినిమాల్లో ఆమె పోషించిన పాత్రలకు మంచి పేరొచ్చింది. ఇక ప్రస్తుతం ఆమె యశోద, హనుమాన్‌, ఎన్‌బీకే 107, శబరి తదితర చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..