Tamannaah: కేరళలో సందడి చేస్తున్న మిల్కీ బ్యూటీ.. వైరల్‌ అవుతోన్న చీర కట్టు రీల్స్‌ వీడియో..

|

Sep 03, 2022 | 10:52 AM

Tamannaah: అప్పుడెప్పుడో 2005లో వచ్చిన 'శ్రీ' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది అందాల తార తమన్నా. అనంతరం 2007లో వచ్చిన 'హ్యాపీడేస్‌'తో ఒక్కసారిగా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకుంది...

Tamannaah: కేరళలో సందడి చేస్తున్న మిల్కీ బ్యూటీ.. వైరల్‌ అవుతోన్న చీర కట్టు రీల్స్‌ వీడియో..
Tamannaah
Follow us on

Tamannaah: అప్పుడెప్పుడో 2005లో వచ్చిన ‘శ్రీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది అందాల తార తమన్నా. అనంతరం 2007లో వచ్చిన ‘హ్యాపీడేస్‌’తో ఒక్కసారిగా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకుంది. ఈ సినిమాలో కాలేజీ అమ్మాయి పాత్రలో నటించిన తమన్నా కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది. అనంతరం ఇండస్ట్రీలో దాదాపు అందరు అగ్ర హీరోల సరసన ఆడిపాడి భారీ విజయాలను సొంతం చేసుకుంది. తెలుగు, తమిళం, హిందీ ఇలా అన్ని భాషల్లో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 17 ఏళ్లు గడుస్తోన్నా ఇప్పటికీ వరుస అవకాశాలు దక్కించుకుంటోంది. ప్రస్తుతం తమన్న చేతిలో ఏకంగా 6 సినిమాలు ఉన్నాయి.

ఓవైపు సినిమాలతో నిత్యం బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది తమన్నా. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలతో పాటు, సినిమా విశేషాలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్‌ చేసుకుంటుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ కేరళలో సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా అక్కడి ప్రకృతి రమణీయత నడుమ చేసిన ఇన్‌స్టా రీల్స్‌ను పోస్ట్‌ చేసింది. ఈ వీడియోలో సిల్వర్‌ కలర్‌ శారీ ధరించిన తమన్నా అందానికే అసూయ కలిగేలా ఉంది.

ఇవి కూడా చదవండి

ఇక ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తూ.. ‘భూతల స్వర్గం కేరళ నుంచి మీ అందరికీ ధన్యవాదాలు’ అంటూ రాసుకొచ్చింది. తమన్నా ఈ వీడియోను ఇలా పోస్ట్‌ చేసిందో లేదో అలా వైరల్‌ అవుతోంది. ఈ వీడియోకి కొన్ని గంటల్లోనే ఏకంగా 5 లక్షల వ్యూస్‌ రావడం విశేషం. ఇక వన్నె తగ్గని అందంతో ఉన్న తమన్నను చూసిన ఫ్యాన్స్‌ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే రీసెంట్‌గా ఎఫ్‌3 మూవీతో ప్రేక్షకులను పలకరించిన తమన్నా ప్రస్తుతం ‘గుర్తుంతా శీతాకాలం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను సెప్టెంబర్‌ 23న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..