Shruti Hassan: తమ అభిమాన తార తమ కళ్ల ఎదుక వచ్చి సందడి చేస్తే ఎలా ఉంటుంది.? అభిమానుల సంతోషానికి అవధులే ఉండవు కదూ! తాజాగా అలాంటి సర్‌ప్రైజ్‌నే ఇచ్చారు నటి శృతీ హాసన్. ఆమె నటించిన చిత్రం 3ని ఇటీవల రీరిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ధనుష్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా 2012లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ధనుష్, శృతీల అద్భుత నటనకు ప్రేక్షకులకు ఫిదా అయ్యారు. వై దిస్ కొలవెర్రి సాంగ్ ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ చిత్రాన్ని మళ్లీ విడుదల చేశారు.
ఇన్నేళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలో సందడి చేసిన 3కి ప్రేక్షకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఏకంగా 150 షోలు హౌజ్ ఫుల్ అయ్యాయంటేనే ఈ సినిమాను ప్రేక్షకులు ఎంతగా ఇష్టపడ్డారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇదిలా ఉంటే గురువారం 3 సినిమా ప్రదర్శితమవుతోన్న ఓ థియేటర్‌లో శృతి హాసన్ సందడి చేశారు. అప్పటి వరకు స్క్రీన్‌పై కనిపిస్తున్న హీరోయిన్ ఒక్కసారిగా తమ ముందు దర్శనమివ్వడంతో ప్రేక్షకులు అవాక్కయ్యారు.
అనంతరం శృతీ.. సినిమాలో ‘కన్నులదా’ పాట పాడారు. ప్రేక్షకులు సైతం శృతీకి తోడై పాటను ఆలపించారు. దీనంతటినీ థియేటర్లో ఉన్న కొందరు వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ సందడి చేస్తోంది. ఏది ఏమైనా రీరిలీజ్ ట్రెండ్ ఓవైపు మేకర్స్‌కి డబ్బులు తెచ్చి పెడుతూనే మరోవైపు ప్రేక్షకులకు డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను పంచుతోందనడంలో ఎలాంటి సందేహం లేదు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..