Shriya saran: అప్పుడు నా ప్రెగ్నెన్సీ గురించి అందుకే మాట్లాడలేదు.. ఆసక్తికర విషయాలు పంచుకున్న శ్రియ..

|

Dec 14, 2022 | 8:24 PM

2001లో వచ్చిన 'ఇష్టం' సినిమాతో వెండి తెరకు పరిచయమైంది అందాల తార శ్రియ. అనతి కాలంలోనే అగ్ర కథానాయికల జాబితాలో చోటు దక్కించుకుంది బ్యూటీ. టాలీవుడ్‌లో దాదాపు అందరు అగ్ర హీరోల సరసన ఆడిపాడిన శ్రియ తనకంటూ ఓ ప్రత్యేకత గుర్తింపును..

Shriya saran: అప్పుడు నా ప్రెగ్నెన్సీ గురించి అందుకే మాట్లాడలేదు.. ఆసక్తికర విషయాలు పంచుకున్న శ్రియ..
Shriya Saran
Follow us on

2001లో వచ్చిన ‘ఇష్టం’ సినిమాతో వెండి తెరకు పరిచయమైంది అందాల తార శ్రియ. అనతి కాలంలోనే అగ్ర కథానాయికల జాబితాలో చోటు దక్కించుకుంది బ్యూటీ. టాలీవుడ్‌లో దాదాపు అందరు అగ్ర హీరోల సరసన ఆడిపాడిన శ్రియ తనకంటూ ఓ ప్రత్యేకత గుర్తింపును సంపాదించుకుంది. ఓవైపు తెలుగులో నటిస్తూనే మరోవైపు కోలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ పలు చిత్రాల్లో నటించి మెప్పించిందీ చిన్నది. ఇక వివాహం తర్వాత సినిమాలు తగ్గించిన ఈ బ్యూటీ కూతురుకి జన్మనిచ్చిన తర్వాత అడపాదడపా సినిమాల్లో నటిస్తోంది.

పూర్తి సమయాన్ని భర్త, కూతురుకు కేటాయిస్తూ ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్‌ చేస్తున్న శ్రియ.. తాజాగా దృశ్యం-2 మూవీలో నటించింది. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో మరోసారి టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా నిలిచిందీ బ్యూటీ. ఇదిలా ఉంటే శ్రియ బిడ్డకు జన్మనిచ్చేంత వరకు ప్రెగ్నెన్సీతో ఉన్న విషయం తెలియలేదు. శ్రియ కూడా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. అయితే తాను అసలు ప్రెగ్నెన్సీ విషయాన్ని ఎందుకు వెల్లడించలేదన్న కారణాన్ని తాజాగా వెల్లడించింది. దృశ్యం2 మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రియ ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

ఈ విషయమై శ్రియ మాట్లాడుతూ.. ‘నా కూతురు ‘రాధ’ కడుపులో ఉన్న అందమైన క్షణాలను ఎలాంటి ఒత్తిడి లేకుండా గడపాలనుకున్నాను. లావుగా అవుతుండడంతో దాని గురించి చింతించాల్సి వచ్చింది. అభిమానులకు, మీడియాకు ఈ విషయం తెలిస్తే నా బాడీ షేప్‌ గురించి రాస్తారు. నా బిడ్డపై దృష్టి పెడతారు. అందుకే ఇలాంటి వాటిపై దృష్టి పెట్టి సమయాన్ని వృథా చేయాలనుకోలేదు’ అని తన ప్రెగ్నె్న్సీ విషయాన్ని బయట పెట్టకపోవడానికి గల అసలు కారణం తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..