బాహ్యంగా రానాను చూసి మోసపోకండి అని అంటోంది హీరోయిన్ సీరత్ కపూర్. రన్ రాజా రన్ సినిమా ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సీరత్.. త్వరలో కృష్ణ అండ్ హిజ్ లీల అనే చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ మూవీని దగ్గుబాటి రానా సమర్పిస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో రానా గురించి చెప్పుకొచ్చింది సీరత్.
రానా తనకు మంచి ఫ్రెండ్ అని ఈ భామ తెలిపింది. బయటకు కనిపించినట్లు అతడు ఉండరని.. రానా చాలా సున్నితమైన వ్యక్తి అని సీరత్ పేర్కొంది. ఇక కృష్ణ అండ్ హిజ్ లీల చిత్రంలో తాను రుక్సార్ అనే పాత్రలో నటించానని.. ఈ పాత్ర తనకు మంచి పేరు తీసుకొస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. కాగా కృష్ణ అండ్ హిస్ లీల చిత్రానికి క్షణం ఫేమ్ రవికాంత్ పేరేపు దర్శకత్వం వహించాడు. ఇందులో గుంటూరు టాకీస్ ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించగా.. శ్రద్ధా శ్రీనాథ్, సీరత్ కపూర్, శాలిని అతడితో రొమాన్స్ చేశారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించిన ఈ చిత్రం మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదల ప్రోమో ఆకట్టుకోవడంతో ఈ మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి.
Read This Story Also:ప్రజంటింగ్ యూ అరివీర భయంకర “అరణ్య”