Watch Video: ఎయిర్‌ పోర్ట్‌లో హీరోయిన్‌కు ఇబ్బందికర అనుభవం.. అభిమాని చేసిన పనికి ఇబ్బందిగా ఫీలైన బాలీవుడ్ బ్యూటీ

సినిమా సెలబ్రిటీలను నేరుగా చూడడం ఎంతో భాగ్యంగా భావిస్తుంటారు. సినిమాల్లో కనిపించే వారిని నేరుగా చూశామనే సంతోషిస్తుంటారు. ఇక ప్రస్తుతం సెల్ఫీల క్రేజ్‌ పెరిగింది. నటీనటులు ఎక్కడ కనిపించినా సెల్ఫీలతో హోరెత్తిస్తున్నారు. అయితే ఈ సమయాల్లో కొందరు అభిమానుల అత్యుత్సాహం...

Watch Video: ఎయిర్‌ పోర్ట్‌లో హీరోయిన్‌కు ఇబ్బందికర అనుభవం.. అభిమాని చేసిన పనికి ఇబ్బందిగా ఫీలైన బాలీవుడ్ బ్యూటీ
Sara Ali Khan

Updated on: Feb 10, 2023 | 9:16 PM

సినిమా సెలబ్రిటీలను నేరుగా చూడడం ఎంతో భాగ్యంగా భావిస్తుంటారు. సినిమాల్లో కనిపించే వారిని నేరుగా చూశామనే సంతోషిస్తుంటారు. ఇక ప్రస్తుతం సెల్ఫీల క్రేజ్‌ పెరిగింది. నటీనటులు ఎక్కడ కనిపించినా సెల్ఫీలతో హోరెత్తిస్తున్నారు. అయితే ఈ సమయాల్లో కొందరు అభిమానుల అత్యుత్సాహం సెలబ్రిటీలను ఇబ్బందికి గురి చేస్తుంటాయి. చాలా మంది సెలబ్రిటీలకు ఇలాంటి చేదు అనుభవం పలుసార్లు ఎదురయ్యాయి. తాజాగా బాలీవుడ్ బ్యూటీ సారా అలీఖాన్‌కు ఇలాంటి ఓ అనుభవమే ఎదురైంది.

ఇటీవల సార్‌ అలీఖాన్‌ కుటుంబంతో ఉదయ్‌పూర్ టూర్‌కి వెళ్లింది. ఉదయ్‌పూర్ పర్యటనను ముగించుకున్న సారా శుక్రవారం ముంబయి విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సమయంలో ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయటకు వెళ్తున్న సారాతో ఫొటోలు దిగడానికి అభిమానులు వచ్చారు. అయితే ఇదే సమయంలో ఓ మహిళా అభిమాని సారాకు షేక్‌ హ్యాండ్‌ ఇచ్చారు. అనంతరం అక్కడి నుంచి వెళుతూ సారా వెంట్రుకలను తాకే ప్రయత్నం చేసింది. దీంతో సారా ఒక్కసారిగా ఇబ్బందిగా గురైంది. అభిమానిని తప్పించుకునే ప్రయత్నం చేసింది.

ఇవి కూడా చదవండి

ఇదంతా అక్కడే ఉన్న ఫోటోగ్రాఫర్ల కెమెరాల్లో రికార్డ్‌ అయ్యింది. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. అభిమానులు చేసే ఇలాంటి పనుల వల్లే సెలబ్రిటీలు బయట కనిపించడానికి ఆసక్తి చూపించరంటూ కొందరు కామెంట్స్‌ చేశారు. ఇక సారా అలీఖాన్‌ కెరీర్‌ విషయానికొస్తే.. ఈ బ్యూటీ ప్రస్తుతం గ్యాస్‌లైట్‌, మెట్రో ఇన్‌ డినో, ఏ వతన్‌ మేరే వతన్‌ వంటి చిత్రాలతో బిజీగా ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..