- Telugu News Photo Gallery Cinema photos Kajol hilarious reply trolls about her fair skin Photos goes attractive in social media 10 02 2023 Telugu Actors Photos
Kajol: అందం కోసం ఇంకా పాకులాటనా..? ఏకీ పారేస్తున్న జనం.. దిమ్మతిరిగే రిప్లైతో నోళ్లు మూయించిన కాజోల్..
బాలీవుడ్ కథానాయిక కాజోల్ దేవ్‌గణ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. తనదైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం పలు కార్యక్రమాల్లో అలరిస్తుంది కాజోల్..
Updated on: Feb 10, 2023 | 8:53 PM

కాజోల్ ! బాలీవుడ్ స్టార్ హీరోయిన్. రోజు రోజుకూ అందం పెంచుకుంటున్న హీరోయిన్. క్రేజ్‌లో ఫేడవుట్ అనే ఊసేలేని హీరోయిన్.

అలాంటి ఈ హీరోయిన్ ఇప్పుడు నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నారు. ట్రెండ్ మాత్రమే కాదు.. ట్రోల్ కూడా అవుతున్నారు.

అందం కోసమే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారనే కారణంతో.. నెటిజన్లకు దొరికేశారు. తన ఫ్యాన్స్‌కు కూడా కోపమొచ్చేలా చేసుకున్నారు.

ఇక కెరీర్ బిగినింగ్‌లో కాస్త డస్టీగా ఉండే కాజోల్.. ఆ తర్వాత కలర్ ఎన్‌హాన్సింగ్ ట్రీట్మెంట్ తీసుకున్నారు. కాస్త తెల్లగా మారిపోయారు. అప్పుడే ఈ విషయంలో తీవ్ర విమర్శలపాలయ్యారు.

ఇక ఇప్పుడు కూడా మళ్లీ వైట్ గా మారేందుకు సర్జరీ చేయించుకున్నారనే విమర్శలు వచ్చేలా చేసుకుంటున్నారు.

తాజాగా కాజోల్ స్కిన్ వైటనింగ్ సర్జరీ చేయించుకున్నారని కొంత మంది నెటిజెన్లు అంటున్నారు . బీ టౌన్ మీడియాలో వస్తున్న వార్తలను సోషల్ మీడియాలో తెగ వైరల్ కూడా చేస్తున్నారు.

అయితే ఇదే న్యూస్ పై తాజాగా స్పందించారు కాజోల్. స్పందించడమే కాదు.. ఓ ఫోటోను తన ఇన్‌స్టా హ్యాండిల్లో పోస్ట్ చేసి మరీ ఈ న్యూస్ క్రియేటర్స్‌కు దిమ్మతిరిగే రిప్లై ఇచ్చారు.

ఫేస్ ఫుల్‌గా మాస్క్‌తో కవర్ చేసుకున్న ఫోటోను షేర్ చేశారు. "మీరు ఎలా తెల్లగా అయ్యారని నన్ను అడిగిన వారికి ఇదిగో అని ఈ షోటోను చూపించేస్తున్నారు. మరో సారి తన ఫన్నీ అండ్ క్రేజీ ఆన్సర్‌తో నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు కూడా..!




