TOP 9 ET News: ఆగిపోయిన చిరంజీవి సినిమా రిలీజ్‌.. & అభ్యుదయ పార్టీ నాయకుడిగా రామ్‌ చరణ్‌..

TOP 9 ET News: ఆగిపోయిన చిరంజీవి సినిమా రిలీజ్‌.. & అభ్యుదయ పార్టీ నాయకుడిగా రామ్‌ చరణ్‌..

Anil kumar poka

|

Updated on: Feb 10, 2023 | 8:54 PM

ఇప్పటి వరకు రామ్ చరణ్ లవర్ బాయ్‌లానూ కనిపించారు. లాగి కొట్టే బాయ్‌లానూ కనిపించారు. ట్రెండీ సినిమాలు చేశారు. ఓ పౌరాణిక ఫిక్షణ్ సినిమాతో దిమ్మతిరిగే హిట్ బీ కొట్టారు. రీజనల్ ఫిల్మ్స్‌ తో స్టార్ అయ్యారు..

01. Ram charan as Political Leader in RC15
ఇప్పటి వరకు రామ్ చరణ్ లవర్ బాయ్‌లానూ కనిపించారు. లాగి కొట్టే బాయ్‌లానూ కనిపించారు. ట్రెండీ సినిమాలు చేశారు. ఓ పౌరాణిక ఫిక్షణ్ సినిమాతో దిమ్మతిరిగే హిట్ బీ కొట్టారు. రీజనల్ ఫిల్మ్స్‌ తో స్టార్ అయ్యారు. పాన్ ఇండియన్ రేంజ్‌ల్లో.. క్రేజ్ సెట్టు చేసుకున్నారు. ఇక ఇప్పుడేమో కాస్త కొత్తగా వింతగా.. అందరికీ షాకిచ్చేలా పొలిటికల్ లీడర్ అవతారమెత్తబోతున్నారు. ఇక మ్యాటర్‌తో ఇప్పుడు నయా బజ్ క్రియేట్ చేస్తున్నారు.

02. Ram Charan Fulfilled His His Boy Fan Wish Who Suffered Cancer
ఓ హీరో అంటే ఎలా ఉండాలి..! పోష్ గా ఉండాలి..! రిచ్ అండ్ ట్రెండీగా కనిపించాలి. సినిమాలలో యాక్టింగ్.. డ్యాన్సింగ్ ఇరగొట్టాలి. ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకోవాలి. నెట్టింట ఎప్పుడూ ట్రెండ్ అవుతూనే ఉండాలి.! ఇక ఇలాంటి యాక్టివిటీస్‌లో టాప్‌ రేటెడ్‌గా ఉన్న మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్… వీటన్నింటితో పాటు తనకున్న మరో క్వాలిటీతో.. అందర్నీ చేతెలెక్కిమొక్కేలా చేస్తున్నారు. తన కైండ్ హార్ట్‌తో ఇప్పుడు కూడా ఓ మంచి పని చేసి..నెట్టింట ట్రెండ్ అవుతున్నారు.

03. Heroine Mrunal Thakur Is Trending In Social Media Becoz of Her Exposing in ‘Selfi’ Film
“ఇంతందం దారి మళ్లిందా.. భూమిపైకే.. చేరుకున్నదా..” అని పాట పాడుతూ తెగ ఫీలైపోయేవారు ఈ పాపని చూసిన తెలుగు కుర్రాళ్లు. “లేకుంటే చెక్కి ఉంటారా.. అచ్చు నీలా శిల్పసంపదా..” అంటూ మురిసిపోతూ.. మైమరిచిపోతూ.. కూర్చునేవారు. దాసోహందినా.. ప్రపంచమే అంటూ.. ఆల్మోస్ట్ తన హార్ట్‌లోని నాలుగు గదులను ఈ అమ్మాయికే పర్మినెంట్ గా ఇచ్చేశారు. నా సీత అంటూ.. నాదే… ఈ సీత అంటూ.. కాస్త ఓవర్ యాక్షన్ కామెంట్సే చేసేవాళ్లు. కట్ చేస్తే.. ఇప్పుడు కళ్లల్లో నీల్లు తిప్పుకుంటున్నారు. ఆ బాలీవుడ్ సినిమాలో సీత ఎక్స్‌పోజింగ్ చూసి షాకవుతున్నారు.

04. Dhanush Is Better Than Those Two Kollywood Star Heroes
తెలుగు వాళ్లేం తక్కువ కాదు.. ధనుష్ చూసి తెలుసుకో విజయ్‌
మళ్లీ తమిళ హీరో తంబీలకు టాలీవుడ్ పై తెగ ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. తెలుగు డైరెక్టర్లను పట్టుకుని మరీ.. బై లింగువల్ సినిమాలతో బిజీ అయిపోవడం ట్రెండ్ అవుతోంది. ఓకే దెబ్బకు రెండు పిట్టలన్న లాజిక్! సరికొత్తగా.. ఇప్పుడిప్పుడే.. అందరి కోలీవుడ్‌ హీరోలకు ఎక్కుతోంది. అందరి హీరోలను బైలింగువల్ కాన్సెప్ట్ సైడు ఓ లుక్కేసేలా కూడా చేస్తోంది. కానీ ఈ ఫీట్‌లో ఇప్పటికైతే .. రిలీజ్‌కు ముందే .. ధనుష్‌కు మాత్రమే తెలుగోళ్ల సపోర్ట్ ఫుల్‌ గా దక్కింది. ఇప్పుడిదే కోలీవుడ్ హీరోలపై అందులోనూ దళపతి విజయ్‌పై నెగెటివ్ కామెంట్స్ వచ్చేలా చేస్తోంది.

05.Mega Star Chiranjeevi’s ‘GangLeader’ Postponed
మోగా ఫ్యాన్స్ రెడీ అయిపోయారు. రచ్చ రచ్చ చేయాలని ఫిక్స్ కూడా అయ్యారు. థియేటర్ల ముందు కట్టే బ్యానర్లు రెడీ చేసుకున్నారు. లోపల విసరడానికి బస్తాల కొద్ది పేపర్ ముక్కలను జమచేసుకున్నారు. ఇక ఆన్‌స్క్రీన్‌ పై వింటేజ్‌ చిరును చూస్తూ.. అరిచి గీపెట్టి సినిమా హాల్‌ను ఊపేయడే ఆలస్యం అనుకున్నారు. ఎర్లీ మార్నింగ్ నుంచి నైట్ సెకండ్ షో వరకు ఇదే షెడ్యూలని అన్నారు. కానీ ఏం లాభం
దిమ్మతిరిగే ట్విస్ట్ రావడంతో.. ఇప్పుడు సైలెంట్‌ అయి కూర్చున్నారు.

06. Director Vivek Agnihotri Hits Back After Prakash Raj’s The kashmir Files Criticism
చిన్న గ్యాబ్ తర్వాత మళ్లీ పొలిటికల్ కమెంట్స్ షురూ చేసిన ప్రకాశ్ రాజ్.. తన కామెంట్స్ తో ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. మోదీ ఫాలోవర్స్‌ను కుక్కలంటూ.. కశ్మీరీ ఫైల్స్ డైరెక్టర్‌ను పనికి మాలిన వాడింటూ.. చాలా షాకింగ్‌గా కామెంట్ చేశారు. కామెంట్‌ బాల్‌ను అటు సైడ్‌ కోర్ట్ కు వదిలారు. ఇక ఇప్పుడు అటు నుంచి అటే.. కశ్మీరీ ఫైల్స్ డైరెక్టర్‌ నుంచి వచ్చే కామెంట్స్‌తో కూడా నెట్టింట వైరల్ అవుతున్నారు! వీళ్లిద్దరి యుద్దంతో.. అందరూ సోషల్ మీడియాకే ఫిక్స్ అయ్యేలా చేస్తున్నారు.

07. Rakul Preeth Singh Marriage News Viral
రకుల్ ప్రీత్ సింగ్.. టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‏గా దూసుకుపోతున్నారు. తెలుగులోనే కాకుండా.. హిందీలోనూ స్టార్ హీరోయిన్‏గా ప్రూఫ్ చేసుకుంటున్నారు. ప్రూఫ్ చేసుకోవడమే కాదు బాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్ అండ్ హీరో జాకీ భగ్నానీతో ఓ రొమాంటిక్ లవ్‌స్టోరీని కూడా రన్ చేస్తున్నారు. ఇక త్వరలో వీరి పెళ్లే! అనే టాక్‌తో.. కామెంట్‌తో.. బీటౌన్‌ లో తెగ బజ్ చేస్తున్నారు.

08. SIDKIA Shares Marriage Video
చూశారుగా.. రెండు మూడు రోజులుగా వింటూనే ఉన్నారుగా…. మీరూ పెళ్లి వీడియోలు చూసేందుకు ఆరాటపడ్డారట. అందుకే తమ పెళ్లి వీడియోను చిన్న పాటి గ్లింప్స్‌లా బయట పెట్టారు. తమ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో షేర్ చేశారు. ఎవరీరు.. ఇంకెవరకు మన సిద్ కియా..! అదేనండి సిద్దార్థ్‌ మల్‌హోత్రా.. కియారా అద్వాణీ దంపతులు.

09.’What the Hell’ Netigens Troll Kartik Aaryan Shahzade Movie Comparing with Allu Arjun’s Ala VaikuntaPuram Lo
పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు.. పొరుగింటి కూర రుచి మరిగినట్టు..! టాలీవుడ్ సినిమాల పై పిచ్చి ప్రేమ పెంచుకుంటోంది బాలీవుడ్ ఇండస్ట్రీ. సేమ్ అచ్చు గుద్ది నట్టు తెలుగు సినిమాలను రీ క్రియేట్ చేయడాన్ని విపరీతంగా అలవాటు చేసుకుంది. అలా అయినా.. సక్సెస్ రేట్ పెరుగుతుందేమో.. అనే థింకింగ్ లోకొచ్చింది. అదే థింకింగ్‌ తో అందర్నీ స్టన్ అయ్యేలా కూడా చేస్తోంది మన పక్కనున్న బాలీవుడ్ ఇండస్ట్రీ.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Condom: కడుపులో కనిపించిన కండోమ్..! కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి రిపోర్ట్‌ చూసి వైద్యులు షాక్‌.

Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Motehr and Son: నువ్వు సూపర్‌ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్‌ చూడాలని..

Published on: Feb 10, 2023 08:54 PM