Sai Pallavi: సాయి పల్లవి రిజక్ట్ చేసిన సినిమాలు ఏవో తెలుసా.. ఆ స్టార్ హీరోలకు కూడా ఫిదా బ్యూటీ నో చెప్పిందా..

శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన అందాల భామ సాయి పల్లవి. ఈ ముద్దుగుమ్మ అందంతో పాటు చక్కటి అభినయాన్ని కనబరుస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Sai Pallavi: సాయి పల్లవి రిజక్ట్ చేసిన సినిమాలు ఏవో తెలుసా.. ఆ స్టార్ హీరోలకు కూడా ఫిదా బ్యూటీ నో చెప్పిందా..
Follow us
Rajeev Rayala

|

Updated on: May 17, 2021 | 9:53 AM

Sai Pallavi : శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన అందాల భామ సాయి పల్లవి. ఈ ముద్దుగుమ్మ అందంతో పాటు చక్కటి అభినయాన్ని కనబరుస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. చూడటానికి అచ్చం తెలుగమ్మాయిలా కనిపించే పల్లవి. తెలుగులో చేసినవి తక్కువ సినిమాలే అయినా మంచి గుర్తింపు తెచ్చుకుంది. వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటూ..టాప్ హీరోయిన్ రేస్ లో దూసుకుపోతుంది. తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో సాయి పల్లవి సినిమాలు చేస్తుంది. యంగ్ హీరోలు ఏమాత్రం ఛాన్స్ దొరికిన సాయిపల్లవిని హీరోయిన్ గా ఎంపిక చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. తాను ఎంచుకున్న సినిమాల ద్వారా.. మంచి నటిగా.. పాత్రకు తగ్గట్లు హావ భావాలను చక్కగా ప్రదర్శించగల భామగా పేరు తెచ్చుకుంది. ఈ భామ ప్రస్తుతం తెలుగులో ‘విరాట పర్వం’ అనే సినిమాను చేస్తోంది. ఈ సినిమాను వేణు ఊడుగుల (నీది నాది ఒకే కథ ఫేమ్‌) దర్శకత్వం వహిస్తున్నారు. తెలంగాణ నేపథ్యంలో నక్సలైట్స్ నేపథ్యంలో ఈ సినిమా రాబోతుంది.  ఈ సినిమాలో సాయిపల్లవి పేదింటి యువతిగా కనిపించనున్నది. అలాగే మరో సారి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ అనే సినిమా చేస్తుంది. అయితే గత మూడేళ్ళలో సాయి పల్లవి నాలుగు సినిమాలని వదులుకుందట. వాటిలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ సినిమా ఒకటి. ముందుగా ఈ సినిమా కోసం సాయిపల్లవిని సంప్రదించారట కానీ పాత్ర నచ్చకపోవడంతో ఆమె రిజెక్ట్‌ చేసిందట. అలాగే ఆ తర్వాత మహేశ్‌ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’లో కూడా మొదట సాయిపల్లవినే హీరోయిన్ గా అనుకున్నారట. కానీ ఆ సినిమాను కూడా ఈ అమ్మడు సున్నితంగా తిరస్కరించిందట. అలాగే.. అయ్యప్పనుమ్ కోషియం( రీమేక్), బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కర్ణన్ (రీమేక్) వంటి సినిమాలు రిజెక్ట్ చేసిందట.  వీటితో పాటు దాదాపు 6 కమర్షియల్‌ యాడ్స్‌ని కూడా ఒప్పుకోలేదట. ఇలా దాదాపు 5 కోట్లకు పైగా ఆదాయం వచ్చే సినిమాలను యాడ్స్  సాయి పల్లవి రిజక్ట్ చేయిందని తెలుస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

KD Chandran: బాలీవుడ్ నటుడు కేడీ చంద్రన్ కన్నుమూత.. చికిత్స పొందుతూ..

మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..