Sadha: జీవితం చాలా చిన్నది, అలాంటి బంధాల కంటే ఒంటరిగా ఉండడమే మేలు.. సదా ఆసక్తికర పోస్ట్‌..

|

Nov 13, 2022 | 4:42 PM

'రాను రాను అంటూనే చిన్నది' అనే పాటతో తెలుగు ప్రేక్షకులకు మెస్మరైజ్‌ చేసింది అందాల తార సదా. జయమ్‌ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తొలి సినిమాతోనే కుర్రకారును ఫిదా చేసింది. ఇక ఈ సినిమాలోనే తన నటనతో ఆకట్టుకున్న ఈ చిన్నది తొలి సినిమాకే ఉత్తమ నటిగా..

Sadha: జీవితం చాలా చిన్నది, అలాంటి బంధాల కంటే ఒంటరిగా ఉండడమే మేలు.. సదా ఆసక్తికర పోస్ట్‌..
Sadha
Follow us on

‘రాను రాను అంటూనే చిన్నది’ అనే పాటతో తెలుగు ప్రేక్షకులకు మెస్మరైజ్‌ చేసింది అందాల తార సదా. జయమ్‌ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తొలి సినిమాతోనే కుర్రకారును ఫిదా చేసింది. ఇక ఈ సినిమాలోనే తన నటనతో ఆకట్టుకున్న ఈ చిన్నది తొలి సినిమాకే ఉత్తమ నటిగా ఫిలిమ్‌ ఫేర్‌ అవార్డును అందుకుంది. అనంతరం పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన సదాకు తర్వాత ఆశించిన స్థాయిలో విజయాలు రాలేవు. దీంతో 2018లో తమిళ్‌లో వచ్చిన టార్చ్‌లైట్‌ తర్వాత మళ్లీ సినిమాల్లో కనిపించలేదు.

అయితే పలు రియాలిటీ షోలలో జడ్జీగా వ్యవహరిస్తూ తాజాగా మళ్లీ తెరపై తరచూ కనిపిస్తోంది సదా. ఈ క్రమంలోనే మరోసారి ప్రేక్షకులకు దగ్గరైంది. ఇక సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ తన లేటెస్ట్ అప్‌డేట్స్‌ను పోస్ట్‌ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆసక్తికర పోస్ట్‌ చేసింది. బంధాలు, అనుబంధాలపై తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పింది. ఇందులో భాగంగానే ఇన్‌స్టాగ్రామ్‌లో సుధీర్ఘ పోస్ట్‌ చేసింది.

ఇవి కూడా చదవండి

ఇంతకీ సదా చేసిన పోస్ట్‌లో ఏముందంటే.. ‘చాలా మంది తమకు ఇష్టమైన వారిని కోల్పోతేమోనని భయపడుతుంటారు. చాలా క్లోజ్‌గా ఉన్నవారు కూడా కొన్ని సందర్భాల్లో మీకు సహకరించరు. మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకున్న వారు మాత్రమే మీకు పూర్తిగా సహకరిస్తారు. మీ ఎదుగుదలకు అడ్డువచ్చే వ్యక్తులను సున్నితంగా తిరస్కరించడమే మంచిది. జీవితంలో చాలా రకాల మనుషులు వస్తుంటారు, పోతుంటారు కానీ చివరి వరకు మనతో ఉండేది మనం మాత్రమే. ఇంట్లో అవసరం లేని వస్తువులను ఎలా అయితే బయటపడేస్తామో, జీవితాల్లో నుంచి కూడా కొందరిని తీసేస్తుండాలి. జీవితం చాలా చిన్నది, బలవంతంగా బంధాల్లో ఉండడం కంటే ఒంటరిగా సంతోషంగా ఉండడమే’ మంచిది అంటూ రాసుకొచ్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..