గీత గోవిందం సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ సాధించడంతో టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది రష్కిక మందన. ఆ తర్వాత వరుస ఆఫర్లను చేజిచ్చకుంటూ బిజీగా మారింది. గతేడాది విడుదలైన సరిలేరు నీకెవ్వరు సినిమాతో మరో విజయంతో ఫుల్ జోరు మీద ఉంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా తనకు ఇష్టమైన రేంజ్ రోవర్ ఎస్ యూవీ కారుని కొనుగోలు చేసింది రష్కిక. తనకు ఎంతో ఇష్టమైన కారు కొనడంతోపాటు దాని ముందు నిలబడి ఫోటోలు దిగి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది.
ఇక అందులో “తనకు సంబంధించిన అన్ని విషయాలను షేర్ చేసుకోవడం ఇష్టం ఉండదని.. కానీ ఈసారి షేర్ చేసుకుంటున్నాను. నేను సాధారణంగా ఇలాంటివి కొనుగోలు చేస్తుంటా. కానీ ఈ విషయాన్ని మీతో చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నా జర్నీలో మీరు కూడా భాగమయ్యారు. నేను మిమ్మల్ని ఎంతగా ఇష్టపడుతున్నానో మీకు తెలియాలి. ఇది మీకోమే. లవ్ యూ అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం రష్మిక షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమాలో రష్మిక నటిస్తోంది. అంతేకాకుండా అటు బాలీవుడ్లో రెండు సినిమాలకు ఓకే చెప్పింది ఈ ముద్దుగుమ్మ.
I’d mostly/normally keep things like these to myself.. but this time I wanted to share this with you because you are part of this journey..and I want you to know that.. ?
I love you. ?
This one’s for you. ?#grateful ? pic.twitter.com/rHJsIRfBkB— Rashmika Mandanna (@iamRashmika) January 6, 2021
Also Read:
Naga Shaurya: నాగశౌర్య ‘న్యూఇయర్’ లుక్ అదుర్స్.. క్యూట్ బాయ్‌గా కనిపిస్తోన్న యంగ్ హీరో..