Rashi Khanna: ‘అవకాశం వస్తే అలాంటి పాత్రలో నటించాలని ఉంది’.. ఆసక్తికర విషయాలను పంచుకున్న అందాల రాశీ..

Rashi Khanna: 'మద్రాస్‌ కేఫ్‌' అనే బాలీవుడ్ సినిమాతో వెండి తెరకు పరిచయమైన అందాల తార 'మనం'లో గెస్ట్‌ రోల్‌లో నటించి తెలుగు ప్రేక్షకులకు పలకరించింది. ఇక 'ఊహలు గుసగుసలాడే' సినిమాతో...

Rashi Khanna: అవకాశం వస్తే అలాంటి పాత్రలో నటించాలని ఉంది.. ఆసక్తికర విషయాలను పంచుకున్న అందాల రాశీ..
Rashi Khanna

Updated on: Jun 16, 2022 | 4:16 PM

Rashi Khanna: ‘మద్రాస్‌ కేఫ్‌’ అనే బాలీవుడ్ సినిమాతో వెండి తెరకు పరిచయమైన అందాల తార ‘మనం’లో గెస్ట్‌ రోల్‌లో నటించి తెలుగు ప్రేక్షకులకు పలకరించింది. ఇక ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో నటిగా మంచి మార్కులు కొట్టేసింది. అందం, అభినయంతో అనతికాలంలో నటిగా మంచి గుర్తింపును సంపాదించుకుందీ బ్యూటీ. టాలీవుడ్‌లో అగ్ర హీరోల సరసన నటించే ఛాన్స్‌ కొట్టేసిన రాశీ.. హిందీ, తమిళంలోనూ వరుస ఆఫర్లను సొంతం చేసుకుంది.

ఇక కేవలం సినిమాలకే పరిమితం కాకుండా వెబ్‌ సిరీస్‌లోనూ నటించి మారుతోన్న కాలంతో పాటు తాను మారింది. తాజాగా గోపీచంద్‌ హీరోగా నటిస్తోన్న ‘పక్కా కమర్షియల్‌’లో నటిస్తున్న రాశీ ఖన్నా. జూన్‌ 1న సినిమా విడుదలవుతోన్న నేపథ్యంలో రాశీఖన్నా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

‘మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘ప్రతి రోజూ పండగే’ సినిమాలో నటించాను. అందులోని నా ఏంజెల్‌ ఆర్నా పాత్రకు ప్రశసంలు దక్కాయి. ఆ పాత్ర నిడివి ఇంకా బాగుండేదని అందరూ అన్నారు. దాంతో మారుతి తన నెక్ట్స్‌ సినిమాలో మంచి రోల్‌ ఇస్తానని మాటిచ్చారు. అలా పక్కా కమర్షియల్‌తో మరోసారి అవకాశం దక్కింది’ అని చెప్పుకొచ్చింది రాశీ. ఇక పక్కా కమర్షియల్‌లో తన పాత్ర గురించి వివరిస్తూ.. తన పాత్ర ఎంతో ఫన్నీగా ఉంటుందని, ప్రతి ఒక్కరూ ఎంజాయ్‌ చేస్తారని చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

ఇప్పటి వరకు తాను నటించిన పాత్రలు, భవిష్యత్తులో నటించాలనుకుంటున్న రోల్స్‌ గురించి రాశీ ఖన్నా మాట్లాడుతూ.. ‘‘ఊహలు గుసగుసలాడే’ నుంచి ఇప్పటి వరకూ నేను చేసిన సినిమాలన్నీ సంతృప్తినిచ్చాయి. భవిష్యత్తులో అవకాశం వస్తే నెగటివ్‌ రోల్‌, బాహుబలి సినిమాలో అనుష్క పోషించిన దేవసేన వంటి బలమైన పాత్రల్లో నటించాలని ఉంది’ అని మనసులో మాట బయట పెట్టిందీ అందాల తార.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..