Rakul Preet Singh: రకుల్‌ నాజూకు సొగసుకు కారణం ఏంటో తెలుసా.? తన డైట్‌ సీక్రెట్‌ను చెప్పేసిన బ్యూటీ..

Rakul Preet Singh: ఇప్పుడు అందరికీ ఫిట్‌నెస్‌పై అవగాహన పెరుగుతోంది. జిమ్‌ల బాట పడుతూ అందరూ బరువు తగ్గించుకోవాలని, సన్నగా మారాలని తెగ వర్కవుట్లు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా..

Rakul Preet Singh: రకుల్‌ నాజూకు సొగసుకు కారణం ఏంటో తెలుసా.? తన డైట్‌ సీక్రెట్‌ను చెప్పేసిన బ్యూటీ..

Updated on: Jun 20, 2022 | 7:03 AM

Rakul Preet Singh: ఇప్పుడు అందరికీ ఫిట్‌నెస్‌పై అవగాహన పెరుగుతోంది. జిమ్‌ల బాట పడుతూ అందరూ బరువు తగ్గించుకోవాలని, సన్నగా మారాలని తెగ వర్కవుట్లు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా సెలబ్రిటీలు ఈ ట్రెండ్‌ను ఎక్కువగా ఫాలోఅవుతుంటారు. నిత్యం అందంగా, యవ్వనంగా కనిపించడానికి నోటిని కట్టేసుకొని మరీ డైటింగ్ చేస్తున్నారు. అయితే తన విషయంలో మాత్రం దీనికి పూర్తి భిన్నమని చెబుతోంది అందాల తార రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన డైట్‌ సీక్రెట్‌ ఇదేనంటూ పలు ఆసక్తికర విషయాలు పంచుకుందీ బ్యూటీ.

తన డైట్‌కు సంబంధించిన వివరాలను తెలుపుతూ.. ‘నాకు డైట్‌ విషయంలో ఎలాంటి నియామాలు లేవు. నచ్చిన ఆహారం కడుపునిండి తినేయడమే నా డైట్‌ సీక్రెట్‌. జ్యూస్‌ కంటే నేరుగా పండ్లు ఆరగించడమే నాకు ఇష్టం. అలా అయితేనే, వాటిలోని పోషకాలు పూర్తిగా అందుతాయి. అలాగే గుజరాతీ థాలీ, గులాబ్‌ జామూన్‌, ఆలూ పరాటా అంటే చాలా ఇష్టం. రెస్టారెంట్లు, స్టార్‌ హోటల్స్‌ కంటే.. ఇంటి భోజనమే అంటేనే నాకు ఇష్టం’ అని చెప్పుకొచ్చిందీ బ్యూటీ.

ఇవి కూడా చదవండి

ఇక కెరీర్‌ విషయానికొస్తే రకుల్‌ ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళం, హిందీ చిత్రాల్లో అరడజను చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. కొన్ని రోజుల క్రితం తనకు కాబోయే వాడిని ప్రపంచానికి పరిచయం చేసిన రకుల్‌ త్వరలోనే పెళ్లి పీఠలు ఎక్కనున్నట్లు సోషల్‌ మీడియాలో వేదికగా ఓ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. రకుల్‌ ప్రస్తుతం నటించిన ఆరు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..