మా అక్క నా డబ్బులు కొట్టేయడానికి ట్రై చేసింది.. పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన హీరోయిన్
అంబిక, రాధ ఇద్దరూ 1980లలో తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ చిత్రాల్లోనూ ప్రముఖ హీరోయిన్లుగా కొనసాగారు. రజనీకాంత్, కమల్ హాసన్ తదితర అగ్ర నటులతో కలిసి నటించి ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ఆమె అక్క అంబిక కూడా హీరోయిన్ గా సినిమాలు చేశారు. ఎన్నో ఏళ్లుగా సినీ రంగంలో సోదరీమణులుగా గుర్తింపు పొందిన వీరిద్దరి మధ్య కుటుంబ వివాదం ఇప్పుడు పోలీస్ ఫిర్యాదు వరకు చేరడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

తమిళ సినీ పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్లుగా వెలుగొందిన అంబిక, రాధ సోదరీమణులు. అయితే ప్రస్తుతం వీరిద్దరి మధ్య నెలకొన్న కుటుంబ, ఆస్తి వివాదం పోలీసుల వరకు వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా తన అక్క, ప్రముఖ నటి అంబికతో పాటు సోదరుడు మల్లికార్జున్‌పై నటి రాధ చెక్ మోసం ఆరోపణలతో చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. రాధ చేసిన ఫిర్యాదు ప్రకారం.. వ్యాపార అవసరాల కోసం గతంలో తన దగ్గర కొన్ని సంతకం చేసిన ఖాళీ చెక్కులను ఉంచుకునేవారని తెలుస్తోంది. అయితే పాత చెక్‌బుక్‌ను వినియోగించడం నిలిపివేసిన తర్వాత కూడా అందులోని కొన్ని చెక్కులు తనకు తెలియకుండా బయటకు తీసి వినియోగించారని ఆమె ఆరోపించినట్లు రిపోర్టులు చెబుతున్నాయి.
బిందాస్ మూవీ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూస్తే మతిపోవాల్సిందే.. ఇప్పుడు ఎలా ఉందంటే
మొత్తం ఐదు పాత చెక్కులను దొంగలించి సుమారు రూ.46 కోట్ల మొత్తాన్ని బ్యాంకులో జమ చేసేందుకు ప్రయత్నించారని రాధ తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. ఈ చెక్కులు వాడి అంబిక మనీ విత్‌డ్రాకు ప్రయత్నించారని ఆమె ఆరోపించినట్లు వార్తలు వెల్లడించాయి. రాధ తెలిపిన వివరాల ప్రకారం, తన బ్యాంక్ ఖాతాకు సంబంధించిన చెక్ డీటైల్స్ పై సెప్టెంబర్ 16న మెసేజ్ అలర్ట్ రావడంతో ఈ విషయం తన దృష్టికి వచ్చినట్లు ఆమె పేర్కొన్నారు. వెంటనే బ్యాంకును సంప్రదించి సంబంధిత చెక్కులపై స్టాప్ పేమెంట్ విధించినట్లు తెలిపారు. దీంతో ఆ మొత్తాన్ని విత్ డ్రా చేసుకోలేకపోయానని ఆమె చెప్పినట్లు మిన్నంబలం రిపోర్ట్ చేసింది. సెప్టెంబర్ 18న మరోసారి మనీ విత్‌డ్రా చేసే ప్రయత్నం జరిగినట్లు కూడా ఆమె ఆరోపించినట్లు పేర్కొంది.
ఆ డైరెక్టర్ అందరి ముందు లాగిపెట్టి కొట్టారు.. ఆ తర్వాత ఆ తప్పు చేయలేదు : బాలాదిత్య
తన చెక్కులు తనకు తెలియకుండా ఎలా బయటకు వెళ్లాయి.? వాటిలో మొత్తాలను ఎవరు నమోదు చేశారు.? బ్యాంకులో ఎవరు మనీ విత్‌డ్రా ట్రై చేశారు.? అనే విషయాలపై పూర్తిస్థాయి దర్యాప్తు జరగాలని రాధ కోరినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో తన అక్క అంబికతో పాటు తన సోదరుడు మల్లికార్జున్‌పై కూడా అనుమానం ఉందని రాధ పేర్కొన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ ఆరోపణలు ప్రస్తుతం రాధ చేసిన ఫిర్యాదులోని వాదనలేనని, వాటిపై పోలీసుల దర్యాప్తు, తర్వాత మరిన్ని వివరాలు తెలుస్తాయి. కాగా చెక్కుల వ్యవహారంతో పాటు తన వ్యక్తిగత వస్తువులు, ఆస్తి పత్రాలకు సంబంధించిన అంశాలను కూడా రాధ తన ఫిర్యాదులో ప్రస్తావించారు. గత కొంతకాలంగా తాను ఉంటున్న ఇంట్లోకి వెళ్లేందుకు అనుమతి లేకపోవడంతో పాటు, తన గదిలో ఉన్న వస్తువులు, పత్రాలను చూడలేకపోతున్నానని ఆమె ఆరోపించారు.
ఓ సీన్ కోసం ఆ స్టార్ హీరో ఉతకాని, వాసనొస్తున్న సూట్ వేసుకున్నారు: దేవి ప్రసాద్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




