pragya Jaiswal: కరోనా మహమ్మారి యావత్ మానవాళిని ఎంతలా భయపెట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కంటికి కనిపించని మాయదారి వైరస్ అగ్రరాజ్యాలను సైతం గడగడలాడించింది. ప్రస్తుతం పరిస్థితులు కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తున్నా ఇప్పటికీ పరిస్థితులు నిగురు కప్పిన నిప్పులా ఉన్నాయి. ఇప్పటికీ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా అందాల తార ప్రగ్యా జైస్వాల్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ప్రగ్యాకు ఇప్పటికే ఒకసారి కరోనా సోకింది. అంతేకాకుండా రెండు డోస్‌ల వ్యాక్స్‌న్ తీసుకున్నప్పటికీ కూడా మళ్లీ వైరస్ సోకడం గమనార్హం.
దీంతో ప్రగ్యా ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్‌లో ఊంటూ చికిత్స తీసుకుంటోంది. తన ఆరోగ్యం బాగానే ఉందంటూ, ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదంటూ గతంలో అభిమానులకు చెప్పుకొచ్చిందీ బ్యూటీ. ఈ క్రమంలోనే ప్రగ్యా తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా చేసిన ఓ ఫోటో దానికి జోడించిన క్యాప్షన్ ఆసక్తికంరంగా ఉంది. ధీనంగా ఏటో వైపు చూస్తున్నట్లు ఉన్న ఫోటోను పోస్ట్ చేసిన ప్రగ్యా.. ఈ ఐసోలేషన్ నుంచి ఎప్పుడు బయట పడుతానోని ఎదురు చూస్తున్నాను. ఆ అందమైన క్షణం కోసం రోజులు లెక్క పెడుతున్నాను. అనే క్యాప్షన్‌ను రాసుకొచ్చింది. ఇక ఈ పోస్ట్ చూసిన ఆమె అభిమానులు.. ప్రగ్యా త్వరగా కోలుకోవాలని కామెంట్లు పెడుతున్నారు.
ఉద్యోగులకు శుభవార్త చెప్పనున్న కేంద్రం.. పీఎఫ్ వడ్డీ దీపావళి పండగకు ముందే మీ ఖాతాలో.. వీడియో
Srilanks: శ్రీలంకలో భగ్గుమన్న నిత్యావసర వస్తువుల ధరలు..!! గగ్గోలు పెడుతున్న జనం.. వీడియో