Pooja Hegde: ఆ తారల గ్లామర్‌కు అక్కడి నీళ్లే కారణమట.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన అందాల బుట్టబొమ్మ..

Pooja Hegde: అందం, అభినయం ఉన్న తారల్లో నటి పూజా హెగ్డే ఒకరు. మొదటి చిత్రం 'ఒకలైలా'తోనే తెలుగు కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిందీ బ్యూటీ. అనంతరం వరుస సినిమాలో నటిస్తూ దూసుకుపోతోంది. ప్రస్తుతం...

Pooja Hegde: ఆ తారల గ్లామర్‌కు అక్కడి నీళ్లే కారణమట.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన అందాల బుట్టబొమ్మ..
అందాల భామ పూజ హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ అమ్మడు. 

Updated on: Dec 07, 2021 | 6:58 PM

Pooja Hegde: అందం, అభినయం ఉన్న తారల్లో నటి పూజా హెగ్డే ఒకరు. మొదటి చిత్రం ‘ఒకలైలా’తోనే తెలుగు కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిందీ బ్యూటీ. అనంతరం వరుస సినిమాలో నటిస్తూ దూసుకుపోతోంది. ప్రస్తుతం తెలుగులో టాప్‌ హీరోయిన్‌లలో ఒకరిగా చోటు దక్కించుకుందీ చిన్నది. ఓవైపు తెలుగులో నటిస్తూనే మరోవైపు తమిళ, హిందీ చిత్రాల్లో నటిస్తూ బిజీ బిజీగా గడిపేస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమైన ఈ అమ్మడు ఏకంగా తన మకాన్ని ముంబయికి మార్చేసింది. ఇటీవలే ముంబయిలో ఓ ఇంటిని కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే తెలుగు సినిమాతో పాపులారిటీ సంపాదించుకొని తమిళ, హిందీ చిత్రాల్లో నటిస్తోన్న ఈ చిన్నది కన్నడ ఇండస్ట్రీకి చెందిన నటీమణి అని మీలో ఎందరికి తెలుసు.? అవును పూజా పూర్వీకులు కర్ణాటకు చెందిన వారే, అయితే ఈ అందాల పుట్టి పెరిగింది మాత్రం ముంబయిలోనే. ఇక తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పూజా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను బాలీవుడ్‌, టాలీవుడ్‌, కోలీవుడ్‌లో మంచి పేరు సంపాదించుకున్నప్పటికీ.. కర్ణాటక అమ్మాయిగా గుర్తింపు పొందడమే ఇష్టమని తేల్చి చెప్పింది. ఇక తన మూలాల్ని నేను ఎప్పుడూ ప్రేమిస్తానని చెప్పిన ఈ చిన్నది.. మంగుళూరు ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గర్విస్తానని స్పష్టం చేసింది.

తాను ముంబైలో పుట్టిపెరిగినప్పటికీ, కన్నడ అమ్మాయి అనిపించుకోవడానికే ఎక్కువ ఇష్టపడతానని చెప్పుకొచ్చింది. కన్నడ నీళ్లలో ఏదో ఉందని, గ్లామర్‌ తారలంతా అక్కడ్నుంచే వస్తున్నారని చాలామంది తనతో అంటుంటారని పూజా తెలిపింది. ఆ మాట విన్నప్పుడు గర్వంగా అనిపిస్తుందని, మాతృభాష నుంచి అవకాశం వస్తే నటించడానికి సిద్థంగా ఉన్నట్లు మనసులో మాట ఇలా బయటపెట్టేసిందీ చిన్నది.

Also Read: Sharwanand : మా బాస్ చెప్పినట్టు అతను సూపర్‌ స్టార్‌ అవుతాడు.. ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసిన శర్వానంద్..

Gadget Guru: అర్జెంటుగా మీ పిసి అప్డేట్ చెయ్యండి.. లేకపోతే మీ డేటా గల్లంతే !! వీడియో

డిజిటల్ విభాగంలో దుమ్మురేపుతున్న TV9 !! యూట్యూబ్‌ వ్యూస్ పరంగా సెన్సేషన్.. వీడియో