AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్టార్ హీరో కుమార్తెను అని తెలిసి కూడా..: వరలక్ష్మీ శరత్ కుమార్

సినీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చినప్పటికీ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు వరలక్ష్మీ శరత్‌కుమార్. అయితే హీరో కుమార్తె అయినప్పటికీ.. ఈమెకు కాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు తప్పలేదు. కెరీర్ ప్రారంభంలో సినిమా ఆఫర్ల కోసం వెళితే

స్టార్ హీరో కుమార్తెను అని తెలిసి కూడా..: వరలక్ష్మీ శరత్ కుమార్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 03, 2020 | 12:32 PM

Share

సినీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చినప్పటికీ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు వరలక్ష్మీ శరత్‌కుమార్. అయితే హీరో కుమార్తె అయినప్పటికీ.. ఈమెకు కాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు తప్పలేదు. కెరీర్ ప్రారంభంలో సినిమా ఆఫర్ల కోసం వెళితే.. పలువురు తనతో అసభ్యంగా ప్రవర్తించారని వరలక్ష్మీ గతంలోనూ పలుమార్లు చెప్పుకొచ్చారు. ఇక దీనిపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో మరోసారి మాట్లాడిన వరలక్ష్మీ.. ‘‘ఒక స్టార్ వారసురాలిని అయినప్పటికీ అన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా.. కానీ సినిమాల కోసం నా కారెక్టర్‌ను నేను వదులుకోకూడదు అని గట్టిగా నిర్ణయించుకున్నా. అలాగే ఎదుగుతూ వచ్చా’’ అని చెప్పారు. తాను ఒక హీరో, రాజకీయ నాయకుడి కుమార్తెను అని తెలిసి కూడా కొంతమంది దర్శకులు, నిర్మాతలు చాలా అసభ్యకరంగా మాట్లాడేవారని ఆమె చెప్పుకొచ్చింది. నేను కాస్టింగ్ కౌచ్‌కు లొంగనని పలువురు ప్రముఖులు చెప్పిన ఆడియో ప్రూఫ్‌లు కూడా తన వద్ద ఉన్నాయని పేర్కొన్నారు.

‘‘అంతేకాదు మొదట్లో కాస్టింగ్ కౌచ్‌కు నేను నో చెప్పినందుకు చాలా మంది నాపై నిషేదం విధించారు. వాటన్నింటిని దాటుకొని నా స్వశక్తితో 25 సినిమాలను పూర్తి చేశా. 25మంది మంచి నిర్మాతలు, దర్శకులతో నేను పనిచేశా. ఇటీవలే 29వ సినిమాకు సంతకం చేశా’’ అని వరలక్ష్మీ తెలిపారు. మహిళలు ఇప్పటికీ ప్రతి చోట ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని.. వాటిపై వారు కచ్చితంగా నోరు విప్పాలని ఆమె సూచించారు. కాగా మాస్‌రాజా రవితేజ నటిస్తోన్న క్రాక్ చిత్రంలో వరలక్ష్మీ శరత్‌కుమార్ ఓ కీలక పాత్రలో నటిస్తోన్న విషయం తెలిసిందే.

Follow Us
రోజుకు రూ.45 పొదుపుతో రూ.25 లక్షల రిటర్న్స్..జీవితాంతం ఉచిత బీమా!
రోజుకు రూ.45 పొదుపుతో రూ.25 లక్షల రిటర్న్స్..జీవితాంతం ఉచిత బీమా!
మళ్లీ పుంజుకుంటున్న బంగారం ధర.. వెండి మాత్రం తగ్గింది!
మళ్లీ పుంజుకుంటున్న బంగారం ధర.. వెండి మాత్రం తగ్గింది!
9 గంటలకే కిటికీలు క్లోజ్.. వట్టివేళ్ల తడకల మ్యాజిక్!
9 గంటలకే కిటికీలు క్లోజ్.. వట్టివేళ్ల తడకల మ్యాజిక్!
ఫ్యామిలీ మెంబర్స్ హెల్తీగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి
ఫ్యామిలీ మెంబర్స్ హెల్తీగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి
గ్రూప్‌లో ఉన్నా సింగిల్‌గానే ఉన్నట్టు అనిపిస్తోందా?
గ్రూప్‌లో ఉన్నా సింగిల్‌గానే ఉన్నట్టు అనిపిస్తోందా?
హాట్ వాటర్, వేడి వేడి బ్రేక్‌ఫాస్ట్.. నిజంగానే హెల్తీనా?
హాట్ వాటర్, వేడి వేడి బ్రేక్‌ఫాస్ట్.. నిజంగానే హెల్తీనా?
Horoscope Today: ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం..
Horoscope Today: ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం..
రాత్రి ఫ్రిజ్‌లో పెట్టిన నాన్‌వెజ్ కర్రీ తింటున్నారా..? ఈ విషయం..
రాత్రి ఫ్రిజ్‌లో పెట్టిన నాన్‌వెజ్ కర్రీ తింటున్నారా..? ఈ విషయం..
శనివారం పూజ, ఉపవాసంలో ఈ తప్పులు చేయొద్దు.. వెంకటేశ్వర స్వామి...
శనివారం పూజ, ఉపవాసంలో ఈ తప్పులు చేయొద్దు.. వెంకటేశ్వర స్వామి...
తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్.. డీట్ యాప్ గురించి మీకు తెలుసా...?
తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్.. డీట్ యాప్ గురించి మీకు తెలుసా...?