Kriti Sanon: ‘ప్రభాస్‌ సినిమా ఎప్పటికీ గుర్తుంటుంది’.. కృతి సనన్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌..

|

Jun 06, 2022 | 7:22 AM

Kriti Sanon: మహేష్‌ బాబు (Mahesh Babu) హీరోగా తెరకెక్కిన 'వన్‌ నేనొక్కడినే' చిత్రంతో వెండి తెరకు పరిచయమైంది అందాల తార కృతి సనన్‌. అనంతరం బాలీవుడ్‌లో (Bollywood) వరుస సినిమాలతో దూసుకుపోయిందీ...

Kriti Sanon: ప్రభాస్‌ సినిమా ఎప్పటికీ గుర్తుంటుంది.. కృతి సనన్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌..
Follow us on

Kriti Sanon: మహేష్‌ బాబు (Mahesh Babu) హీరోగా తెరకెక్కిన ‘వన్‌ నేనొక్కడినే’ చిత్రంతో వెండి తెరకు పరిచయమైంది అందాల తార కృతి సనన్‌. అనంతరం బాలీవుడ్‌లో (Bollywood) వరుస సినిమాలతో దూసుకుపోయిందీ బ్యూటీ. అగ్ర హీరోల సరసన నటించే అవకాశం దక్కించుకున్న ఈ చిన్నది నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ క్రమంలోనే కృతి నటించిన ‘మిమి’ సినిమా అనూహ్య విజయాన్ని అందుకుంది. డబ్బు కోసం సరోగసీ ద్వారా బిడ్డను కనే అవివాహిత పాత్రలో కృతి అద్భుత నటనను కనబరించింది. మిమిలో కృతి నటనకు విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి.

తాజాగా ప్రకటించిన ‘ఐఫా 2022’లో కృతి సనన్‌ ఈ సినిమాకుగాను ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. తొలి ఐఫా అవార్డు అందుకున్న నేపథ్యంలో కృతి సంతోషాన్ని అభిమానులతో పంచుకుంది. అవార్డు అందుకున్న తర్వాత కృతి మాట్లాడుతూ.. ‘మిమి సినిమా నాకెంతో పేరు తెచ్చింది. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు జ్యూరీ సభ్యులను కూడా గెలవడం ఆనందంగా ఉంది. తొలిసారి ఐఫా అవార్డు అందుకోవడం సంతోషంగా ఉంది’ అని చెప్పుకొచ్చిందీ బ్యూటీ.

ఇక కృతి నటిస్తోన్న ప్రస్తుతం చిత్రం ఆదిపురుష్‌ గురించి మాట్లాడుతూ.. ప్రభాస్‌తో నటిస్తున్న సినిమా తన కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోతుందని తెలిపింది. రామాయణ ఇతిహౄసం ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కృతి సీత పాత్రలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇక కృతి ఈ సినిమాతో పాటు టైగర్‌ ష్రాఫ్‌తో ‘గణపథ్‌’, కార్తీక్‌ ఆర్యన్‌ సరసన ‘షెహజాదా’ సినిమాల్లో నటిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..