Kriti Sanon: ఆ రోజు చాలా సేపు ఏడ్చాను.. జీవితంలో ఎదురైన చేదు సంఘటనను గుర్తు చేసుకున్న కృతి

|

Sep 05, 2023 | 7:17 AM

వెలుగు, చీకట్లు అన్నట్లు.. జీవితంలో కష్టసుఖాలు కూడా చాలా కామన్‌. అందుకే ఏదీ శాశ్వతం కాదనే వేదాంతంతో జీవించాలని మన పురాణాలు సైతం చెబుతున్నాయి. కష్టాల్లో ఉన్నప్పుడు కుంగిపోకూడదని చెబుతుంటారు. ఇప్పుడిదంతా ఎందుకనేగా మీ సందేహం. అందాల తార కృతి సనన్‌ తన జీవితంలో ఎదురైన ఓ చేదు సంఘటనకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది...

Kriti Sanon: ఆ రోజు చాలా సేపు ఏడ్చాను.. జీవితంలో ఎదురైన చేదు సంఘటనను గుర్తు చేసుకున్న కృతి
Kriti Sanon
Follow us on

జీవితం అంటే ఎవరికీ పూలపాన్పు కాదని చెబుతుంటారు. జీవితంలో ఏదో ఒక సమయంలో ప్రతీ ఒక్కరూ కష్టాలను ఎదుర్కోవాల్సిందే. దీనికి ఎవరూ అతీథులు కాదు. వెలుగు, చీకట్లు అన్నట్లు.. జీవితంలో కష్టసుఖాలు కూడా చాలా కామన్‌. అందుకే ఏదీ శాశ్వతం కాదనే వేదాంతంతో జీవించాలని మన పురాణాలు సైతం చెబుతున్నాయి. కష్టాల్లో ఉన్నప్పుడు కుంగిపోకూడదని చెబుతుంటారు. ఇప్పుడిదంతా ఎందుకనేగా మీ సందేహం. అందాల తార కృతి సనన్‌ తన జీవితంలో ఎదురైన ఓ చేదు సంఘటనకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ అందాల తార కృతి సనన్‌ ఓ బ్యాడ్ ఇన్సిడెంట్‌ను పంచుకుంది. ప్రస్తుతం అగ్ర హీరోయిన్‌గా రాణిస్తున్న తాను కెరీర్‌ తొలి నాళ్లలో చేదు సంఘటనలను ఎదుర్కున్నానని చెప్పుకొచ్చింది. అందరి జీవితం పూలపాన్పు లాంటిది కాదని ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది. ముంబయికి వచ్చిన తొలి నాళ్లలో ఎదురైన ఓ సంఘటన గురించి ప్రస్తావిస్తూ.. ‘నేను ముంబయికి వచ్చిన రోజులవి. ఆ సమయంలో నేను మోడలింగ్‌ చేస్తూనే సినిమాల్లో ఆఫర్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నాను. అదే సమయంలో నాకు తెలుగులో వన్‌తో పాటు, హీరోపంతీ అనే సినిమాల్లో నటించే ఛాన్స్‌ వచ్చింది. కొన్ని రోజుల్లో షూటింగ్ ప్రారంభం అనగా ఒక ర్యాంప్‌ షోలో పాల్గొనడానికి వెళ్లాను’ అని తెలిపింది.

ఇవి కూడా చదవండి

కృతి ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్..

ఆ సమయంలో క్యాట్‌వాక్‌ చేస్తున్న సమయంలో కృతి హీల్స్‌ నేలలో దిగబడిపోయాయని, దీంతో గందరగోళానికి గురై, తాను మధ్యలోనే ఆగిపోయయాని చెప్పుకొచ్చింది. దాందో ఆ షోకి కొరియోగ్రాఫీ చేసిన ఆవిడ వెంటనే గట్టిగా అరుస్తూ, 50 మంది మోడళ్ల ముందు తనపై అరిచిందని తెలిపింది. ఆ సయంలో తనకు కన్నీళ్లు ఆగలేవని, పక్కకి వెళ్లి చాలా సేపు గుక్కపెట్టి ఏడ్చానని చెప్పుకొచ్చింది. జీవితంలో మళ్లీ ఆమెతో కలిసి పని చేయలేనది కృతి గుర్తు చేసుకుంది. ఇలా తన జీవితంలో ఎదురైన ఓ చేదు సంఘటన గురించి పంచుకుంది కృతీ.

ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కృతీ..

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..