Krithi Shetty: కృతిశెట్టి క్రేజ్‌కి ఇది మరో ఉదాహరణ.. బేబమ్మ ఖాతాలో మరో అరుదైన రికార్డు..

|

Apr 10, 2022 | 8:57 AM

Krithi Shetty: సినీ తారల క్రేజ్‌ను వారి సోషల్‌ మీడియా (Social Media) ఫాలోవర్ల సంఖ్య ఆధారంగా అంచనా వేసే రోజులు వచ్చేశాయి. ఎంత మంది ఎక్కువ ఫాలోవర్లు ఉంటే అంత క్రేజ్‌ ఉన్నట్లు. ముఖ్యంగా యువత తమ అభిమాన నటీనటులను సోషల్‌ మీడియాలో..

Krithi Shetty: కృతిశెట్టి క్రేజ్‌కి ఇది మరో ఉదాహరణ.. బేబమ్మ ఖాతాలో మరో అరుదైన రికార్డు..
Krithi Shetty
Follow us on

Krithi Shetty: సినీ తారల క్రేజ్‌ను వారి సోషల్‌ మీడియా (Social Media) ఫాలోవర్ల సంఖ్య ఆధారంగా అంచనా వేసే రోజులు వచ్చేశాయి. ఎంత మంది ఎక్కువ ఫాలోవర్లు ఉంటే అంత క్రేజ్‌ ఉన్నట్లు. ముఖ్యంగా యువత తమ అభిమాన నటీనటులను సోషల్‌ మీడియాలో ఫాలో అవుతూ వారి అప్‌డేట్స్‌ ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలోనే సెలబ్రిటీలు సామాజిక మాధ్యమాల వేదికగా భారీగా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను పెంచుకుంటున్నారు. కేవలం తమ అప్‌డేట్స్‌ను ఫ్యాన్స్‌తో పంచుకోవడమే కాకుండా సోషల్‌ మీడియాలో ప్రకటనలు పోస్ట్‌ చేస్తూ కూడా రెండు చేతులా డబ్బులు సంపాదిస్తున్నారు. సంస్థలు కూడా సెలబ్రిటీల ఫాలోవర్ల ఆధారంగానే ప్రకటనలకు రెమ్యునరేషన్‌ ఇస్తున్నారు. ఇలా ఫాలోవర్లను పెంచుకుంటూ పోతున్న వారి జాబితాలో తాజాగా అందాల తార కృతిశెట్టి కూడా చేరింది.

తాజాగా కృతిశెట్టి ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్ల విషయంలో మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. అత్యంత తక్కువ సమయంలో ఎక్కువ మంది ఫాలోవర్లను దక్కించుకున్న నటిగా నిలిచిందీ ముద్దుగుమ్మ. ఈ అందాల తార ఫాలోవర్ల సంఖ్య తాజాగా ఏకంగా 30 లక్షలు దాటేసింది. ఈ విషయాన్ని స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో పంచుకుంది. రెడ్‌ రోజ్‌ను చేతులో పట్టుకొని.. తన ఫాలోవర్లు 3 మిలియన్‌లకు చేరారని తెలిపిన కృతి, ‘లవ్‌ యూ ఆల్‌’ అంటూ రాసుకొచ్చింది.

ఇక ‘ఉప్పెన’ సినిమాతో వెండి తెరకు పరిచయమైన కృతిశెట్టి ఈ సినిమాలో బేబమ్మగా కుర్రకారును మెస్మరైజ్‌ చేసిన విషయం తెలిసిందే. ఒక్క సినిమాతోనే భారీ క్రేజ్‌ను దక్కించుకున్న ఈ బ్యూటీకి వరుస ఆఫర్లు క్యూకట్టాయి. శ్యామ్‌సింగరాయ్‌, బంగార్రాజు చిత్రాలతో బ్యాక్‌ టు బ్యాక్‌ విజయాలను సొంతం చేసుకుంది. కృతిశెట్టి ప్రస్తుతం తెలుగులో ‘మాచర్ల నియోజకవర్గం’, ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ ‘ది వారియర్‌’ చిత్రాల్లో నటిస్తోంది.

Also Read: Hindu Temple: ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయం ఎక్కడ ఉంది..? నిర్మించడానికి పట్టిన సమయం 30 ఏళ్లు..!

Rajamouli: మహేష్ సినిమాపై హింట్ ఇచ్చిన రాజమౌళి.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి..

Sonam Kapoor: బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ ఇంట్లో భారీ చోరీ.. కోట్ల రూపాయాలు.. నగలు దొంగతనం..