
టాలీవుడ్, కోలీవుడ్‌లలో తనదైన అభినయంతో, సహజమైన నటనతో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలుగుతున్న హీరోయిన్ కీర్తి సురేశ్. మహానటి సినిమాకుగానూ జాతీయ అవార్డు అందుకున్న ఈ అమ్మడు ఇప్పుడు కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ ప్రశంసలు అందుకుంటున్నారు. హిట్టు, ప్లాపులతో సంబంధమే లేకుండా ప్రేక్షకులు మెచ్చే కథలను ఎంపిక చేసుకుంటూ బిజీగా ఉంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి సురేశ్ తన జీవితంలో ఎదురైన ఊహించని సంఘటన గురించి పంచుకుంది. సినిమాలతో ఎప్పుడూ బిజీగా ఉండే ఈ బ్యూటీకి ఇటీవల విమాన ప్రయాణంలో ఒక చేదు అనుభవం ఎదురైనట్లు చెప్పుకొచ్చింది. సెలబ్రిటీలు ఎక్కడికి వెళ్లినా వారిని గుర్తించి అభిమానం చూపించడం సాధారణమే అయినప్పటికీ, కొంతమంది ప్రవర్తించే తీరు ఒక్కోసారి ఇబ్బందికరంగా మారుతుంటుంది. తాజాగా కీర్తి సురేశ్ విషయంలోనూ అదే జరిగిందని వెల్లడించింది.
ఎక్కువ మంది చదివినవి : Soundarya : సౌందర్యతో 3 బ్లాక్ బస్టర్స్ చేశా.. ఆమె భర్త ఇప్పుడు ఏం చేస్తున్నారంటే.. టాలీవుడ్ హీరో కామెంట్స్..
వివరాల్లోకి వెళితే.. కీర్తి సురేశ్ తన భర్తతో కలిసి విమాన ప్రయాణంలో ఉన్న సమయంలో తోటి ప్రయాణికులలో ఒక వ్యక్తి మద్యం మత్తులో ఆమె వద్దకు వచ్చాడని తెలిపింది. విమానం గాల్లో ఉండగానే ఆ వ్యక్తి పరిమితులు మీరి ఆమెతో సెల్ఫీ దిగాలని తీవ్రంగా ఇబ్బంది పెట్టాడని వెల్లడించింది. కేవలం ఫొటో కోసమే కాకుండా, ఆయన ప్రవర్తించిన తీరు కాస్త అభ్యంతరకరంగా ఉండటంతో కీర్తి సురేశ్ తీవ్ర అసౌకర్యానికి గురయ్యానని.. వెంటనే అతడికి దూరంగా జరిగినట్లు వెల్లడించింది.
ఎక్కువ మంది చదివినవి : ఏముంటది మావ ఈ పాట.. 32 ఏళ్లుగా యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న లవ్ సాంగ్.. అప్పట్లో లవర్ కోసం తెగ పాడేవారు..
వెంటనే అప్రమత్తమైన తన భర్త ఆంటోని సీరియస్ అయ్యాడని.. అయినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో అక్కడే ఉన్న విమాన సిబ్బందిని పిలిచినట్లు తెలిపారు. వెంటనే అప్రమత్తమైన క్యాబిన్ క్రూ సిబ్బంది జోక్యం చేసుకుని ఆ వ్యక్తిని అక్కడి నుంచి పంపించివేశారని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కీర్తి సురేశ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. సెలబ్రిటీల వ్యక్తిగత భద్రత , ప్రైవసీకి భంగం కలిగించేలా ఇలా ప్రవర్తించడం పట్ల నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా సరే అభిమానం పేరుతో హద్దులు మీరి ప్రవర్తించడం సరికాదని, విమానాలలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Aamani: మా కాంబినేషన్ అంటే అప్పట్లో సూపర్ హిట్.. ఆ హీరోతో ఎక్కువ సినిమాలు చేశా.. ఆమని ..
ఎక్కువ మంది చదివినవి : Ramya Krishna : మేమిద్దరం మంచి ఫ్రెండ్స్.. ఆ పాటతోనే కృష్ణవంశీతో నా కనెక్షన్ మొదలైంది.. రమ్యకృష్ణ..