
అటు కెరీర్, ఇటు పర్సనల్ లైఫ్‌లో మోస్ట్ సక్సెస్ ఫుల్ ఉమెన్‌గా పేరు సంపాదించుకున్నారు నటి కాజల్ అగర్వాల్. లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ చిన్నది అనతి కాలంలోనే అగ్ర కథానాయికల జాబితాలో చేరిందీ బ్యూటీ. ఇండస్ట్రీలో దాదాపు అందరు అగ్ర హీరోల సరసన ఆడిపాడిందీ బ్యూటీ. కేవలం తెలుగుకే పరిమితం కాకుండా బాలీవుడ్‌లోనూ నటించి మెప్పించింది. ఇండస్ట్రీలో చాలా ఏళ్ల పాటు వరుస అవకాశాలను దక్కించుకుంది. ఇక సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలోనే ముంబైకి చెందిన వ్యాపార వేత్త గౌతమ్ కిచ్లును వివాహం చేసుకుంది.
2020లో వివాహం చేసుకున్న ఈ జంట ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ప్రస్తుతం అడపాదడపా సినిమాల్లో నటిస్తున్న ఈ బ్యూటీ ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది. పూర్తి సమయాన్ని భర్త, కుమారుడితో స్పెండ్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఫ్యామిలీతో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా క్రిస్మస్ సందర్భంగా కుమారుడు, భర్తతో దిగిన ఫొటోను కాజల్ షేర్ చేసింది. గౌతమ్ కుమారుడిని ఎత్తుకోగా, మరో వైపు కాజల్ భర్తకు ముద్దు ఇస్తుండగా తీసిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ ఫొటోతో పాటు.. ఈ క్రిస్మస్‌కు నేరు కోరుకుంటోన్న ప్రేమ ఇదేనంటూ ఎమోషనల్ క్యాప్షన్ రాసుకొచ్చింది.
ఇక కెరీర్ విషయానికొస్తే కాజల్ చివరిగా దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కిన ‘హే సినామిక’ అనే తమిళ చిత్రంలో నటించింది. అయితే ఆచార్యలో కూడా కాజల్ నటించింది. అయితే గర్భవతి కావడంతో చిత్రాన్ని పూర్తి చేయలేకపోయింది. దీంతో కాజల్ పాత్రను సినిమా నుంచి తొలగించారు. ఇదిలా ఉంటే కాజల్ ప్రస్తుతం కమల్ హీరోగా తెరకెక్కుతోన్న ‘ఇండియన్ 2’తో పాటు మరికొన్ని తమిళ చిత్రాల్లో నటిస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..