Banita Sandhu tests positive : కరోనా బారిన పడిన మరో హీరోయిన్.. ఇటీవలే యూకే నుంచి వచ్చిన బ్యూటీ

|

Jan 06, 2021 | 12:53 PM

టాలీవుడ్ లో సంచలన విజయం సాధించిన అర్జున్ రెడ్డి సినిమా తమిళ్ లో ఆదిత్య వర్మ అనే సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. స్టార్ హీరో విక్రమ్ కుమారుడు ధృవ్ హీరో ఈ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు..

Banita Sandhu tests positive : కరోనా బారిన పడిన మరో హీరోయిన్.. ఇటీవలే యూకే నుంచి వచ్చిన బ్యూటీ
Follow us on

Banita Sandhu : టాలీవుడ్ లో సంచలన విజయం సాధించిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా తమిళ్ లో ‘ఆదిత్య వర్మ’ గా తెరకెక్కిన విషయం తెలిసిందే. స్టార్ హీరో విక్రమ్ కుమారుడు ధృవ్ హీరో ఈ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా హీరోయిన్ గా నటించిన బానిటా సంధు తాజాగా కరోనా బారిన పడింది. ఈ అమ్మడు ఇటీవల యూకే నుంచి వచ్చింది. కరోనా లక్షణాలు ఉండటంతో టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. అయితే వెంటనే బానిటా సంధును సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ ఆమె చేర్చుకోవడానికి ఆసుపత్రి సిబ్బంది నిరాకరించారని తెలుస్తుంది. దాంతో ఆమెను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కాగా డిసెంబర్ 20 న యూకే  నుండి బానిట కోల్ కతా వచ్చారు. ఆ క్రమంలోనే తనకు స్ట్రెయిన్ వైరస్ సోకిందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సోమవారం మధ్యాహ్నం కోవిడ్ -19 పాజిటివ్ నిర్ధారణ అవ్వగా… ఆమె కొత్త కరోనా స్ట్రెయిన్ బారిన పడినదా అని నిర్ధారించడానికి చర్యలు తీసుకుంటున్నామని ఓ అధికారి తెలిపారు. బానిట ప్రస్తుతం కవిత అండ్ తెరెసా చిత్రం షూటింగ్ లో పాల్గొంటోంది.