అప్సరా రాణి పేరును కుర్రకారుకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ‘4 లెటర్స్’ అనే తెలుగు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది అందాల తార. అయితే ఈ సినిమాతో ఈ అమ్మడుకు పెద్దగా పేరు కాలేదు కానీ రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘థ్రిల్లర్’తో విపరీతమైన క్రేజ్‌ను దక్కించుకుంది. తన హాట్ హాట్ అందాలతో కుర్రాళ్లను కట్టిబడేసిందీ బ్యూటీ. దీంతో ఈ బ్యూటీకి తెలుగులో అవకాశాలు క్యూ కట్టాయి. హీరోయిన్ కంటే స్పెషల్ సాంగ్స్‌లో ఎక్కువగా నటించిందీ చిన్నది. మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన ‘క్రాక్’, సుధీర్ బాబు హీరోగా వచ్చిన ‘హంట్’ సినిమాలో అప్సర స్పెషల్ సాంగ్స్‌లో కనిపించి మెప్పించింది.
ఇదిలా ఉంటే సినిమాల కంటే సోషల్ మీడియా ద్వారా ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటుందీ బ్యూటీ. హాట్ హాట్ ఫొటోలను పోస్ట్ చేస్తూ కుర్రకారుల హృదయాలను కొల్లగొడుతుంది. థ్రిల్లర్ మూవీ సమయంలో చిత్రంలోని స్టిల్స్‌ను పోస్ట్ చేస్తూ అప్సర చేసిన రచ్చ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ బ్యూటీ ఒక్క ఫొటో పోస్ట్ చేసిందంటే చాలు నెట్టింట ఒక్కసారిగా హీట్ పెరగాల్సిందే. లైక్‌లు, కామెంట్స్‌తో సోషల్ మీడియా రచ్చ జరగాల్సిందే.
The Waterfall is calling and I must go! pic.twitter.com/d9ozN1yn8j
— Apsara Rani (@_apsara_rani) November 28, 2022
ఈ నేపథ్యంలో అప్సరా రాణి తాజాగా ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన కొన్ని ఫొటోలు నెట్టింగ తెగ సందడి చేస్తున్నాయి. జలపాతం ముందు భొయలు పోతూ దిగిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. వైట్ డ్రస్‌లో నీటి తుంపరుల్లో తడిసిన అప్సర రాణి.. నిజంగానే అప్సరసను తలపిస్తోంది. ఈ ఫొటోలతో పాటు.. ‘జలపాతం పిలుస్తోంది..నేను వెళ్లాలి’ అనే క్యా్ప్షన్‌ను జోడించిందీ బ్యూటీ. ఇక అప్సర ప్రస్తుతం.. నగేష్ నారదాసి దర్శకత్వంలో వస్తున్న ‘తలకోన’ చిత్రంలోప్రధాన పాత్రలో నటిస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..