Tollywood: అమెరికాలో ఓటేసిన హీరోయిన్.. షాకవుతున్న ఫ్యాన్స్.. ఇంతకీ ఆమె ఎవరంటే..?

భారతదేశంలో నివసిస్తూనే విదేశీ పౌరసత్వం ఉన్న తారల గురించి మీరు ఇంతకు ముందు వినే ఉంటారు. ఈ స్టార్ నటీనటులు తమ విదేశీ పౌరసత్వం గురించి నెట్టింట తరచుగా ట్రోలింగ్‌ను ఎదుర్కొంటారు. అయితే ఇది మీకు తెలుసా ? తాజాగా ఓ ప్రముఖ నటి అమెరికా ఎన్నికల్లో ఓటు వేశారు. దీంతో ఆమె అభిమానులకు షాకవుతున్నారు.

Tollywood: అమెరికాలో ఓటేసిన హీరోయిన్.. షాకవుతున్న ఫ్యాన్స్.. ఇంతకీ ఆమె ఎవరంటే..?
Actress
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 06, 2024 | 6:17 PM

భారతీయ సినీ పరిశ్రమలో అమెరికా లేదా కెనడా వంటి దేశ పౌరసత్వం ఉన్న నటీనటులు చాలా మంది ఉన్నారు. అందువల్ల వారు ఎక్కువగా విమర్శలకు గురవుతారు. అంతేకాదు మన దేశంలో జరిగే ఎన్నికలలో కొందరు తారలు ఓటు హక్కును వినియోంచుకోకపోవడంతో సోషల్ మీడియాలో ట్రోల్స్ కు గురవుతారు. ఇప్పుడు అలాంటి నటి గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఆమె భారతీయ సంతతికి చెందిన నటి. కానీ ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేశారు. దీంతో ఆమె అమెరికన్ సిటిజన్ అని తెలిసి ఆమె అభిమానులు షాక్ అవుతున్నారు. ఆ నటి మరెవరో కాదు ఆకాంక్ష రంజన్ కపూర్. ఆమె ఇటీవల జరిగిన 47వ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేశారు. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌, డెమొక్రాటిక్‌ అభ్యర్థి కమలా హారిస్‌ మధ్య హోరాహోరీగా సాగుతున్న ఆకాంక్ష భారత అభిమానుల దృష్టిని ఆకర్షించింది. ఆమె అమెరికా పౌరురాలినని వారికి తెలియడం ఇదే తొలిసారి.

ముంబైలో నివసిస్తూ ఫిల్మ్ ఇండస్ట్రీలో నటనలో కెరీర్‌ను కొనసాగిస్తున్న ఆకాంక్ష రంజన్ కపూర్, తాను యుఎస్ ఎన్నికల్లో ఓటు వేసినట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో తన అభిమానులకు తెలిపింది. అలాగే కమలా హారిస్ అనే స్టిక్కర్ షేర్ చేయడంతో ఆమె కమలా హారిస్‌కు ఓటు వేసినట్లు తెలుస్తోంది. ఆకాంక్ష రంజన్ కపూర్ అమెరికా పౌరురా ? అంటూ పోస్టులు పెడుతున్నారు నెటిజన్స్. దీంతో ఇతర దేశాల పౌరసత్వం ఉన్న కొంతమంది బాలీవుడ్ తారల పేర్లు కూడా ఇప్పుడు తెరపైకి వచ్చాయి. అక్షయ్ కుమార్ ఇటీవలే తన కెనడియన్ పౌరసత్వాన్ని వదులుకున్నాడు. అలాగే అలియాకు బ్రిటిష్ పాస్‌పోర్ట్ ఉంది. ఇది కాకుండా చాలా మంది తారలకు విదేశీ పౌరసత్వం ఉంది.

అలియా భట్, ఆకాంక్ష ఇద్దరూ స్నేహితులు. ఆకాంక్ష నటుడు, దర్శకుడు శశిరంజన్, అనురంజన్ దంపతుల కుమార్తె. ఆమె ముంబైలో జన్మించింది. ముంబైలోని జమ్నాబాయి నర్సి స్కూల్లో చదువుకుంది. ఆకాంక్ష 2020లో నెట్‌ఫ్లిక్స్ చిత్రం ‘గిల్టీ’లో తొలిసారిగా నటించింది. ఇటీవల నెట్‌ఫ్లిక్స్ చిత్రం ‘మోనికా..ఓ మై డార్లింగ్’లో కూడా ఆమె ఒక ముఖ్యమైన పాత్రను పోషించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు.

ఇది చదవండి : Arundhati movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు.. అరుంధతి డ్యాన్స్ టీచర్‏ను చూశారా..?

Anshu Ambani: మతిపోగొట్టేస్తోన్న మన్మథుడు హీరోయిన్.. కొత్త ఫోటోలతో మెంటలెక్కిస్తోన్న అన్షు..

Tollywood: నడుమందాలతో తికమక పెట్టేస్తోన్న వయ్యారి.. హిట్టు కొట్టిన క్రేజీ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!