Vijay Devarakonda: అనతి కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరిగా స్థానం సంపాదించుకున్నాడు యంగ్ హీరో విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా ఇండియన్ సినిమా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్న విజయ్ బ్రాండ్ విలువ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రౌడీ వియర్ పేరుతో క్లాతింగ్ బ్రాండ్‌తో వ్యాపారంలోకి కూడా అడుగు పెట్టాడు. విజయ్ అటిట్యూడ్, అభిరుచికి చాలా దగ్గరగా ఉంటుంటాయి రౌడీ వియర్ కలెక్షన్స్. ప్రతీ ఏటా సరికొత్త కలెక్షన్స్ తీసుకొచ్చే విజయ్ తాజాగా రౌడీ సీజన్ 2022 అంటూ కొత్త కలెక్షన్ విడుదల చేశారు.
ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించిన విజయ్ ఓ బ్రాండింగ్ వీడియోను విడుదల చేశాడు. ఇందులో విజయ్ రౌడీ బ్రాండ్‌తో కూడిన హుడీని ధరించాడు. ఇక విజయ్ దేవరకొండ నయా లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చాలా రోజుల నుంచి తమ అభిమాన హీరోను తెరపై చూసుకొని అభిమానులు విజయ్ కొత్త లుక్‌తో ఫుల్ ఖుషీ అవుతున్నారు.
Rowdy
Season 2022 pic.twitter.com/8jL7un7U6T— Vijay Deverakonda (@TheDeverakonda) January 13, 2022
ఇక విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లైగర్ చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా శరవేగంగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా తాజాగా కరోనా కారణంగా చిత్రీకరణకు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే.
Also Read: LPG Subsidy: వంట గ్యాస్ సబ్సిడీ మీ ఖాతాలో పడుతుందో లేదో ఆన్‌లైన్‌లో ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి..
Bangarraju Pre Release Event: బంగార్రాజు ప్రీ రిలీజ్ ఈవెంట్.. లైవ్ వీడియో
TOP 9 ET News: బన్నీ సినిమాపై నార్త్‌లో ఆందోళన | RRR వాయిదా పై చెర్రీ కీలక వ్యాఖ్యలు.. వీడియో