Sonu Sood: ‘సీఎం ఆఫర్ వచ్చింది… కానీ..’ రాజకీయాల్లోకి రావడంపై సోనూ సూద్ ఏమన్నాడంటే?

ప్రముఖ నటుడు సోనూసూద్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కొవిడ్ సమయంలో ఆయన వేలాది మందికి సహాయం చేశారు. కార్మికులకు దేవుడిగా కనిపించారాయన. ఇదే క్రమంలో పలు రాజకీయ పార్టీలు సోనూసూద్‌ను తమ పార్టీలోకి చేర్చుకునేందుకు ప్రయత్నించాయి. అయితే సోనూసూద్ ఏ పార్టీలో చేరలేదు. అయితే అప్పట్లో తనకు వచ్చిన ఆఫర్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చెప్పుకొచ్చాడీ రియల్ హీరో.

Sonu Sood: 'సీఎం ఆఫర్ వచ్చింది... కానీ..' రాజకీయాల్లోకి రావడంపై సోనూ సూద్ ఏమన్నాడంటే?
Sonu Sood
Follow us
Basha Shek

|

Updated on: Dec 27, 2024 | 5:20 PM

దక్షిణాదితో పాటు బాలీవుడ్ సినిమాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సోనూ సూద్. తెరపై విలన్ పాత్రలు పోషిస్తున్నప్పటికీ నిజ జీవితంలో అతను రియల్ హీరో. ప్రపంచాన్ని కుదిపేసిన కొవిడ్ సమయంలో ఎవరూ చేయలేని మంచి పనులు చేశారాయన. ఇల్లు వదిలి ఇతర రాష్ట్రాలకు పనికి వెళ్లిన కార్మికులను తన సొంత ఖర్చులతో స్వస్థలాలకు తరలించాడు. ఇదే సమయంలో సోనూ సూద్ సేవ గురించి రోజుకో కథనాలు వచ్చాయి. సోనూ సుద్ సహాయం పొందిన చాలా మంది తమ పిల్లలకు సోనూ సుద్ పేరు పెట్టారు. పలువురు రాజకీయ నేతలు కూడా సోనూ సుద్ర సేవను అభినందిస్తూ ట్వీట్లు చేశారు. కొన్ని రాష్ట్రాల గవర్నర్లు సోనూసూద్‌ను పిలిచి సన్మానించారు. పలువురు కేంద్ర మంత్రులు కూడా సోనూసూద్‌ను కలిసి సన్మానించారు. అదే సమయంలో, సోనూసూద్ రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్లు పుకార్లు వచ్చాయి. కానీ అది అబద్ధమని తేలింది. తాజాగా హ్యూమన్స్ ఆఫ్ బాంబేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో, సోనూసూద్ తనకు అప్పట్లో వచ్చిన రాజకీయ ఆఫర్ల గురించి ఓపెన్ అయ్యాడు. తనకు సీఎం లేదా డీప్యూటీ సీఎం ఆఫర్లు ఇచ్చారన్నారు. ‘మీరు ఎన్నికల్లో నిలబడకండి., మాతో పాటు నిలబడండి అని కొందరు జాతీయ స్థాయి నేతల నుంచి ఆ ఆఫర్లు వచ్చాయని సోనూసూద్ తెలిపారు. ఆయన్ను రాజ్యసభ సభ్యుడిగా చేయాలనే ప్రతిపాదన కూడా ఓ పార్టీ నుంచి వచ్చింది. అయితే ఏ పార్టీ నుంచి, ఏ నేత ఆఫర్ ఇచ్చారనేది సోనూసూద్ వెల్లడించలేదు.

ఇవి కూడా చదవండి

‘రాజకీయం చాలా మందికి అధికారం, డబ్బు. కానీ నాకు ఆ రెండింటిపై ఆశ లేదు. నేను ఇప్పటికే ప్రజలకు సహాయం చేస్తున్నాను. నేను ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నాకు పరిధులు కూడా లేవు. నేను రాజకీయాల్లో ఉంటే ఎవరికైనా సమాధానం చెప్పాలి, నన్ను నియంత్రించడానికి ఎవరైనా ఉంటారు. అది నాకు ఇష్టం లేదు’ అందుకే రాజకీయాల్లోకి వెళ్లలేదు అని సోనూసూద్ చెప్పాడు.

సోనూసూద్ ఎన్నికల్లో పోటీ చేయనప్పటికీ, ఆయన సోదరిని పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ తరపున పోటీకి దింపారు. తన సోదరి తరపున ప్రచారం కూడా చేశారు. అయితే ఆయన సోదరి ఎన్నికల్లో గెలవలేదు. ఎన్నికల్లో ఆప్ అనుకూల అభ్యర్థి విజయం సాధించారు. పంజాబ్‌లో కాంగ్రెస్ ఓడిపోయి ఆప్ అధికారంలోకి వచ్చింది.

సోనూసూద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.