Ranveer Singh: న్యూడ్ ఫొటో వ్యవహారంపై విచారణకు హాజరు కాలేను.. గడువు పెంచండి.. పోలీసులకు రణ్ వీర్ వినతి

|

Aug 22, 2022 | 6:24 AM

న్యూడ్ ఫొటోలతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలిచిన యాక్టర్ రణ్ వీర్ సింగ్ (Ranveer Singh) కు పోలీసులు గతంలో నోటీసులు జారీ చేశారు. దీనిపై విచారణకు హాజరయ్యేందుకు రేపు (ఆదివారం) రావాలని అధికారులు నోటీసుల్లో..

Ranveer Singh: న్యూడ్ ఫొటో వ్యవహారంపై విచారణకు హాజరు కాలేను.. గడువు పెంచండి.. పోలీసులకు రణ్ వీర్ వినతి
Follow us on

న్యూడ్ ఫొటోలతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలిచిన యాక్టర్ రణ్ వీర్ సింగ్ (Ranveer Singh) కు పోలీసులు గతంలో నోటీసులు జారీ చేశారు. దీనిపై విచారణకు హాజరయ్యేందుకు రేపు (ఆదివారం) రావాలని అధికారులు నోటీసుల్లో వెల్లడించారు. దీనిపై స్పందించిన రణ్ వీర్ సింగ్ వ్యక్తిగత కారణాల వల్ల తాను హాజరు కాలేనని, మరింత గడువు కావాలని కోరినట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ నెల 22న చెంబూర్ (Chembur) పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరు కావాలని గతంలో నోటీసులు జారీ చేశారు. దీంతో చెంబూరు పోలీసులు కొత్త తేదీని ఖరారు చేయనున్నారు. బాలీవుడ్‌ యాక్టర్ రణ్‌వీర్‌ సింగ్ టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారిన విషయం తెలిసిందే. ఓ మ్యాగజైన్‌కు శరీరంపై దుస్తులు లేకుండా నగ్నంగా చేసిన ఫొటో షూట్ సంచలనం కలిగించింది. ఈ వ్యవహారం బాలీవుడ్‌నే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇలా ఫొటో షూట్‌ చేయడంపై రకరకాల కామెంట్లు వెల్లువెత్తాయి. కొందరు ఈ చర్యను సమర్థించగా మరికొందరు తీవ్రంగా వ్యతిరేకించారు.

ఈ నేపథ్యంలో ముంబయిలో రణ్‌వీర్‌పై పోలీసులకు పలువురు మహిళా సంఘాలు ఫిర్యాదులు చేశారు. ముంబయికి చెందిన ఓ స్వచ్ఛంద సంస్థతో పాటు మరో మహిళా న్యాయవాది పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. రణ్‌వీర్‌ న్యూడ్‌ ఫొటోలను పోస్ట్‌ చేయడం ద్వారా మహిళల మనోభావాలను గాయపరిచాడని మండిపడ్డారు. అతనిపై ఐటీ యాక్ట్‌ 67ఏతో పాటు 292, 293, 354, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని పోలీసులను కోరారు. ఈ క్రమంలో పోలీసులు రణ్ వీర్ కు నోటీసులు జారీ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి