ఆరు సంవత్సరాల క్రితం మలయాళంలో సెన్సెషనల్ హిట్ సాధించిన సినిమా దృశ్యం. ఈ మూవీ తెలుగు, తమిళంతోపాటు మరో మూడు భాషల్లో రీమేక్ అయ్యి.. అక్కడ కూడా సూపర్ హిట్ అయ్యింది. తాజాగా ఈ సినిమా సిక్వెల్ను మరోసారి మలయాళంలో తెరకెక్కించారు. మలయాళ స్టార్ మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రలో నటించగా.. జీతు జోసెఫ్ దర్శకత్వం వహించాడు. ఫిబ్రవరి 19న ఈ మూవీని అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేశారు. దాదాపు ఈ సినిమాను రూ.50 కోట్ల బడ్జెట్‌తో తెరెకెక్కించారు.
మోహాన్ లాల్ ప్రధాన పాత్రలో వచ్చిన దృశ్యం 2 సినిమాకు కూడా లీకర్స్ బాధ తప్పలేదు. ఈ మూవీని తమిళ్ రాకర్స్ అనే పైరసీ వెబ్ సైట్ లీక్ చేసింది. ఈ వెబ్ సైట్ చాలా సంవత్సరాల నుంచి అటు వెండితెరను.. ఇటు బుల్లితెరకు సంబంధించిన పలు విషయాలను లీక్ చేస్తూ వస్తుంది. ఇక ఈ మూవీ ఇతర వెబ్ సైట్స్‌లో కూడా చూడటానికి మరియు డౌన్ లోడ్ చేసుకోవడానికి వీలవుతుంది.
ఈ క్రమంలో ఓ ఇంగ్లీష్ పేపర్‌కు ఇచ్చిన ఇంటర్వులో డైరెక్టర్ జోసెఫ్ మాట్లాడుతూ.. మొదటి సినిమాలో చూపించిన సంఘటనల తర్వాత దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత దానికి సిక్వెల్ విడుదల చేసాం. కుటుంబానికి కలిగిన ఆ సమస్య తర్వాత వారి జీవితం ఎలా సాగింది అనేది ఈ సినిమా అంటూ చెప్పుకోచ్చారు. పోలీసులు హత్య దర్యాప్తును క్లోజ్ చేయకుండా.. ఆ కుటుంబానికి తెలియకుండా కేసును ఛేదిస్తూంటారు. ఈ క్రమంలో పోలీసులకు ధీటుగా ఆ కుటుంబం ఎలాంటి ప్లాన్స్ వేస్తుంది అనేది ఇందులో చూడోచ్చు అంటూ తెలిపారు. తాజాగా విడుదలైన సినిమాలో ప్రారంభంలోనే ఆ హత్య కేసుతో కుటుంబం కనిపించడం మొదలైవుతుంది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా హత్యా కేసు నుంచి తప్పించుకుంటున్న కుటుంబం.. మళ్లీ తెరపైకి రావడం.. ఆ కేసు రీఓపెన్ కావడం.. సాక్ష్యులు, వారి వాంగ్మూలాలు రికార్టు చేయడం.. కుటుంబానికి మళ్లీ ఆ కేసు చుట్టుకోవడం ఇలాంటి ట్విస్టులతో కూడి ఉంటుంది. తాజాగా విడుదలైన విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది ఈ సినిమా. కాగా ఈ మూవీ చైనీస్ మరియు సింహాళీస్ అనే రెండు భాషలలో రీమేక్ అయ్యింది.
అయితే ఈ సినిమా పైరసీ వెబ్ సైట్ లో లీక్ మేకర్స్ తోపాటు ప్రైమ్ వీడియోకు గట్టి దెబ్బతీసింది. గతంలో కూడా ఇలాంటి పైరసీ వెబ్ సైట్లు ప్రీమియం కంటెంట్‌ను విడుదల చేసి డౌన్ లోడ్ ఆప్షన్ అందించాయి. ఇలాంటి వెబ్ సైట్స్ పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ.. అధికారింగా విడుదలైన తాండవ్, ఆశ్రమం 2, లూడో మరియు చలాంగ్ సినిమాలు లీకయ్యాయి. తమిళ్ రాకర్స్ కు సంబంధించినంతవరకు ఈ వెబ్ సైట్ గతంలో అనేక సార్లు బ్లాక్ చేశారు. తాజాగా డొమైన్ పేరుతో మరో వెబ్ సైట్ క్రియేట్ చేసి… సినిమాలను లీక్ చేస్తున్నరారు.
Also Read: