ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పోలింగ్ కొనసాగుతోంది.. ఏపీలో 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలతోపాటు.. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక కొనసాగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు ఓటు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కేంద్రాల వద్దకు ఓటర్లు చేరుకుంటుండటంతో భారీ క్యూలైన్లు కనిపిస్తున్నాయి. సెలబ్రిటీలు కూడా ఓటు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఉదయాన్నే ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. క్యూలైన్లలో నిల్చొని ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తన భార్య ప్రణిత, తల్లి షాలినితో కలిసి జూబ్లీహిల్స్‌లోని ఓబుల్‌రెడ్డి స్కూల్‌లోని పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు వేశారు. చిరంజీవి, అల్లు అర్జున్, పలువురు టాప్ స్టార్లు కూడా తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.
ఓటు వేసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఓటర్లకు కీలక సందేశమిచ్చారు.. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, రాబోయే తరాలకు అందించాల్సిన మంచి సందేశం ఇదని భావిస్తున్నాన్నట్లు జూనియర్ ఎన్టీఆర్ అన్నారు.
#WATCH | Telangana: Actor Jr NTR, along with his family, shows the indelible ink mark on his finger after voting at a polling booth in Jubilee Hills, Hyderabad.#LokSabhaElections2024 pic.twitter.com/G7c4HpWhnG
— ANI (@ANI) May 13, 2024
అయితే.. ఎన్టీఆర్ ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత .. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. దీనికి కారణం .. ఆయన ధరించిన షర్ట్.. పోలింగ్ డే రోజున ఎన్టీఆర్ బ్లూషర్ట్ వేసుకుని వచ్చి ఓటు వేశారు. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు పోలింగ్ డే రోజున జూనియర్ ఎన్టీఆర్ బ్లూ షర్ట్ లో కనిపించడం వెనుక రాజకీయ కారణం ఉందంటూ పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కామెంట్లు చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. బ్లూ షర్ట్ వేసుకొచ్చి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు బిగ్ సిగ్నల్ ఇచ్చారంటూ నెటిజన్లు ఎక్స్ లో షేర్ చేస్తుండటంతో ఇటు సోషల్ మీడియాతోపాటు.. అటు ఏపీ రాజకీయ వర్గాల్లోనూ ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది.
NTR wearing Blue … is that a statement. pic.twitter.com/eoebzz6Uwv
— Actual India (@ActualIndia) May 13, 2024
అయితే, ఎన్టీఆర్ క్యాజువల్ లుక్ లోనే కనపించారని.. ఇలాంటి ప్రచారం అర్ధరహితమని మరికొందరు ఫ్యాన్స్ వాదనలను కొట్టిపడేస్తున్నారు.
NTR came for voting wearing a Blue Shirt .
Is there a Message to his fans ? pic.twitter.com/jUSEbjQQI4
— D I N A K A R – Modi Ka Parivar. (@_dinakar_) May 13, 2024
మొత్తానికి ఇలా సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ట్రెండ్ అవుతున్నారు.. కానీ, దీని వెనుక కథ ఎంటన్నది సస్పెన్స్ గానే మిగిలిపోయింది.. జూనియర్ ఎన్టీఆర్ మాత్రం రాజకీయాల గురించి, పార్టీల గురించి ఇప్పటివరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.. ఫ్యాన్స్ కు ఎలాంటి సిగ్నల్ కూడా ఇవ్వలేదని క్లియర్ కట్ గా అర్ధమవుతోంది..
ఏపీ, తెలంగాణ ఎన్నికల ఓటింగ్ లైవ్ అప్డేడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..