AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ హీరో నా రూమ్మేట్.. ఎన్నో కష్టాలు పడ్డాం! ఇద్దరం ఒకేసారి సినిమాల్లోకి వచ్చాం

తెలుగు సినీ నటుడు గిరిబాబు తన సినీ ప్రస్థానంలోని కఠినమైన రోజులను గుర్తుచేసుకున్నారు. మద్రాసులో ఓ హీరోతో రూమ్మేట్స్‌గా నెలకు చెరొక 20 రూపాయలతో జీవనం గడిపామని తెలిపారు. తినడానికి కష్టపడి, బెంచీలపై నిద్రపోయిన రోజులు ఉన్నాయని, ఆ తర్వాత వారిద్దరూ ప్రసిద్ధ నటులుగా ఎలా ఎదిగారో వివరించారు.

ఆ హీరో నా రూమ్మేట్.. ఎన్నో కష్టాలు పడ్డాం! ఇద్దరం ఒకేసారి సినిమాల్లోకి వచ్చాం
Giribabu
Rajeev Rayala
|

Updated on: Nov 21, 2026 | 12:41 PM

Share

తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్న నటుడు గిరిబాబు మరణం సినీ ఇండస్ట్రీకి తీరని లోటు. 600లకు పైగా సినిమాలు చేసిన గిరిబాబు ఎంతో మందితో కలిసి నటించారు. గతంలో ఆయన ఓ కార్యక్రమంలో తన సినీ ప్రస్థానం,తన గతం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తన కెరీర్ మొదట్లో విలన్ పాత్రలతో ప్రసిద్ధి చెంది, ఆ తర్వాత హీరోగా, నిర్మాతగా కూడా రాణించిన గిరిబాబు, తన ప్రారంభ దశలో మోహన్ బాబుతో కలసి పడిన కష్టాలను వివరించారు. మొదట విలన్‌గా ముద్రపడిపోయిన తాను, ఇండస్ట్రీలో ఆటోమేటిక్‌గా అదే వేషాలు వచ్చేవని తెలిపారు. హీరోగా ప్రయత్నించినా, విలన్‌గా ఎక్కువగా ఒప్పుకోవాల్సి వచ్చేదని పేర్కొన్నారు. ఈ సినీ ప్రయాణంలో తాను ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నానని, మద్రాసులో పస్తులున్న సందర్భాలు, బెంచీలపై నిద్రపోయిన రోజులు ఉన్నాయని గుర్తుచేసుకున్నారు. కేవలం 35 రూపాయలతో 60 భోజనం టోకెన్లు కొని వాటిని మూడు రోజుల్లో తినేసేవాడినని, తోటి వారితో పంచుకోవడం వల్ల అవి త్వరగా అయిపోయేవని వివరించారు. పాంగల్ పార్కుల్లో, ఇతర ప్రాంతాల్లో జీడిపప్పులు, వేరుసెనగ పప్పులు, అరిటిపండ్లు, బిస్కెట్లు తిని చాలా రోజులు గడిపినట్లు ఆయన చెప్పారు.

ఈ కష్టాల సమయంలో మోహన్ బాబుతో తనకు పరిచయం ఏర్పడిందని, ఇద్దరూ రూమ్మేట్స్‌గా మారారని గిరిబాబు వెల్లడించారు. అప్పట్లో మోహన్ బాబు కేసరి హైస్కూల్‌లో డ్రిల్ మాస్టర్‌గా పనిచేస్తూ, సినిమాల్లో నటించాలనే బలమైన కోరికతో ఉండేవారు. ఇద్దరూ పాండిబజార్‌లో తరచు కలుసుకుని సినిమా అవకాశాల గురించి మాట్లాడుకునేవారు. నెలకు 40 రూపాయల అద్దెతో ఒక గదిని తీసుకుని, చెరొక 20 రూపాయలు పంచుకుని ఆ గదిలో నివసించారని తెలిపారు. ఇది 1969 ప్రాంతంలో జరిగిందని ఆయన పేర్కొన్నారు.

తాను దాసరి నారాయణరావు గారి పిలుపుతో సినిమాల్లోకి ప్రవేశించగా, మోహన్ బాబు అసిస్టెంట్ డైరెక్టర్‌గా సినీ పరిశ్రమలో అడుగుపెట్టారని గిరిబాబు వివరించారు. తాను నటించిన కొన్ని సినిమాలకు మోహన్ బాబు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారని చెప్పారు. 1975లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన స్వర్గం నరకం సినిమా మోహన్ బాబుకు పెద్ద బ్రేక్ ఇచ్చిందని, ఆ తర్వాత ఇద్దరూ విలన్లుగా పోటీ పడుతూ, అనేక చిత్రాలతో బిజీగా ఉన్నారని గిరిబాబు గుర్తుచేసుకున్నారు. తరువాత మూడు సంవత్సరాలకే తాను నిర్మాతగా మారానని గిరిబాబు తెలిపారు. విలన్‌గా చేస్తూనే హీరోగా కూడా సావాసగాడు వంటి చిత్రాల్లో నటించానని, అందులో కృష్ణ గారితో పాటు తాను కూడా హీరోగా నటించానని చెప్పారు. తాను జె.బి.ఆర్. ఆర్ట్స్ అనే బ్యానర్‌ను ప్రారంభించి, దేవతలా జేయిస్తా అనే సినిమాను నిర్మించానని, అందులో తానే హీరోగా నటించానని గిరిబాబు ఈ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us