AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : ఆ సాంగ్ ఉంటే సినిమా ఎవరు చూస్తారు అన్నారు.. కట్ చేస్తే.. 365 రోజులు హౌస్ ఫుల్..

ప్రముఖ నటుడు బాబూ మోహన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం, ఎవర్ గ్రీన్ హిట్ చిత్రాల వెనుక ఉన్న సవాళ్ల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తనకు డాన్స్‌లో నైపుణ్యం లేకపోయినా, దర్శకుల సహకారంతోనే అది సాధ్యమైందని తెలిపారు. రోజుకు ఆరు షిఫ్టులు పనిచేస్తూ, చిరంజీవి వంటి మహానటుల ఆదరాభిమానాలను పొందానని పేర్కొన్నారు.

Cinema : ఆ సాంగ్ ఉంటే సినిమా ఎవరు చూస్తారు అన్నారు.. కట్ చేస్తే.. 365 రోజులు హౌస్ ఫుల్..
Chinuku Chinuku Song
Rajitha Chanti
|

Updated on: Oct 01, 2026 | 11:57 AM

Share

టాలీవుడ్ ఇండస్ట్రీలో దశాబ్దాలుగా వందలాది చిత్రాలతోపాటు వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు నటుడు బాబూ మోహన్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సుధీర్ఘ సినీ ప్రయాణం గురించి చెప్పుకొచ్చారు. ముఖ్యంగా చినుకు చినుకు అందెలతో పాట ఆవిర్భావం, దాని అద్భుత విజయం గురించి వివరించారు. తెలుగు సినీ పరిశ్రమలో ఒక దశాబ్ద కాలం పాటు సిల్క్ స్మిత, సౌందర్య, ఆమని, డిస్కో శాంతి వంటి అగ్రతారలతో కలిసి పాటలలో నటించడం తన కెరీర్‌లో ఒక ప్రత్యేకతగా నిలిచిందని ఆయన గుర్తు చేసుకున్నారు. దర్శకులు తనలోని డాన్సర్‌ను గుర్తించి, తనకు అవకాశాలు ఇచ్చారని తెలిపారు. తన కెరీర్‌లో మొదటి పాట రేలంగి నరసింహారావు గారి సినిమాలో ఏవండీ ఆవిడొచ్చింది చిత్రంలో ఒక పారడీ బిట్ అని బాబూ మోహన్ వెల్లడించారు. ఆ సమయంలో తనకు డాన్స్ సరిగా రాదని, టైమింగ్ మిస్ అవుతూ ఉండేదని అన్నారు. అప్పుడు దర్శకుడు స్వయంగా తన ముఖంపై చేయి పెట్టి, అడుగులు వేయడం నేర్పించి, బీట్‌కు అనుగుణంగా కాలు కదపడం ఎలాగో నేర్పించారని గుర్తు చేసుకున్నారు. ఈ అనుభవం తనకు డాన్స్ పట్ల అవగాహన కల్పించిందని చెప్పారు.

ఎక్కువ మంది చదివినవి : Megastar Chiranjeevi: చిరంజీవి, అనుష్క కాంబోలో మిస్సైన సినిమా.. కట్ చేస్తే.. ఆ హీరోయిన్‏తో బాస్ బ్లాక్ బస్టర్ హిట్..

అనంతరం, రాజేంద్రుడు గజేంద్రుడు చిత్రంలోని ‘చినుకు చినుకు’ అందెలతో పాట తన కెరీర్‌ను మలుపు తిప్పిందని బాబూ మోహన్ పేర్కొన్నారు. ఈ పాట ఇంత పెద్ద హిట్ అవుతుందని చిత్ర బృందంతో పాటు తాను కూడా ఊహించలేదని తెలిపారు. ఈ పాట 365 రోజులు హౌస్‌ఫుల్‌తో నడిచి, శ్రీనివాస థియేటర్‌లో జనం పూలు, కాగితాలు, డబ్బులు విసురుతూ తమ అభిమానాన్ని చాటుకున్న అద్భుత దృశ్యాన్ని ఆయన వివరించారు. ఒక పాటతో సినిమా ఒక సంవత్సరం ఆడటం అరుదైన చరిత్ర అని ఆయన అన్నారు. ఈ విజయ పరంపర తర్వాతే మాయలోడు సినిమాతో పాటల సీజన్ మొదలైందని, ప్రతీ సినిమాలోనూ తనకో పాట ఉండేదని గుర్తు చేసుకున్నారు. తన ఈ విజయాలను తన దైవ కృపగా, తన అదృష్టంగా భావిస్తానని, డాన్స్ కానీ, డైలాగ్ చెప్పడం కానీ తనకు రాదని వినయంగా పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

ఎక్కువ మంది చదివినవి : Cinema : ఐరెన్ లెగ్ అన్న హీరోయిన్.. ఒక్క పాటతో గెల్డోన్ బ్యూటీగా మార్చిన రాఘవేంద్రరావు.. ఇప్పటికీ ఆమె తోపు యాక్టర్..

తన వ్యక్తిగత కృషి గురించి మాట్లాడుతూ, తాను సుమారు 16-17 సంవత్సరాల పాటు రోజుకు ఆరు షిఫ్టులు పనిచేసేవాడినని బాబూ మోహన్ తెలిపారు. ఉదయం నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు కూడా షిఫ్టులు ఉండేవని, అలాంటి షిఫ్టులలో చిరంజీవి వంటి మహానటులు కూడా తనతో కలిసి పనిచేసి, తన కష్టాన్ని చూసి బాధపడేవారని ఆయన స్మరించుకున్నారు. ముఠా మేస్త్రి, స్నేహం కోసం వంటి చిత్రాలలో చిరంజీవితో కలిసి పనిచేసిన అనుభవాలను పంచుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema : ఈ సినిమాకు ఏం డిమాండ్ రా బాబూ.. ఓటీటీలో గత్తరలేపుతున్న మూవీ.. ఫ్యామిలీతో అస్సలు చూడలేరు..

చినుకు చినుకు సాంగ్..

ఎక్కువ మంది చదివినవి : Nayanthara : తెలుగులో ఆ హీరో నాకు బెస్ట్ ఫ్రెండ్.. కానీ ఇప్పుడు చాలా బిజీ అయిపోయాడు.. నయనతార.

Follow Us