AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జంతువులను తినే మొక్కలు.. ఇవి మాంసాన్ని ఎందుకు తింటాయో తెలిస్తే..

మొక్కలు అంటే మనకు గుర్తొచ్చేది ఆకులు, పువ్వులు, పండ్లు.. గాలి, నీరు, ఎండను పీల్చుకుని బతికే సాధు జీవులు.. కానీ, కొన్ని మొక్కలు కీటకాలను, చివరికి చిన్న చిన్న ఎలుకలు, కప్పలను కూడా బలితీసుకుని రక్తం, మాంసాన్ని జ్యూస్‌లా తాగేస్తాయని మీకు తెలుసా? సైన్స్ ఫిక్షన్ సినిమాలో చూసే వింత జీవుల్లా ఉండే ఈ మాంసాహార మొక్కల వెనుక ఉన్న అసలు రహస్యమేంటి? అవి ఎందుకు అలా వేటాడతాయి? అనేది తెలుసుకుందాం..

జంతువులను తినే మొక్కలు.. ఇవి మాంసాన్ని ఎందుకు తింటాయో తెలిస్తే..
Plants That Eat Animals
Krishna S
|

Updated on: Oct 22, 2026 | 3:51 PM

Share

మొక్కలు సూర్యరశ్మి, నీరు, గాలిని పీల్చుకుని ఆహారాన్ని తయారు చేసుకుంటాయని మనందరికీ తెలుసు. కానీ పురుగులు, కీటకాలు, చివరకు చిన్న చిన్న ఎలుకలు, కప్పలను కూడా వేటాడి తినే మొక్కలు ఉన్నాయని మీకు తెలుసా? వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా.. ప్రకృతిలో ఇవి నిజం.. వీటిని శాస్త్రీయంగా కీటకాహార మొక్కలు అని పిలుస్తారు. ఈ మొక్కలు పెరిగే చిత్తడి నేలల్లో నైట్రోజన్, పాస్పరస్ వంటి అత్యవసర పోషకాలు చాలా తక్కువగా ఉంటాయి. బ్రతకడానికి అవసరమైన ప్రోటీన్లు, నైట్రోజన్ నేల నుంచి లభించకపోవడంతో.. ఆ లోటును భర్తీ చేసుకునేందుకు ఇవి కీటకాలు, చిన్న జంతువులను వేటాడి, వాటి మాంసం నుంచి రక్తం, పోషకాలను పీల్చుకుంటాయి.

అత్యంత ప్రమాదకరమైన 4 మాంసాహార మొక్కలు

వీనస్ ఫ్లైట్రాప్

దీని ఆకులు ఒక బోనులా రెండు రెక్కలుగా విడిపోయి ఉంటాయి. ఆకుల మధ్యలో సూక్ష్మమైన రోమాలు ఉంటాయి. ఏదైనా ఈగ లేదా కీటకం ఆ రోమాలను రెండుసార్లు తాకగానే క్షణంలో ఆకులు మూసుకుంటాయి. ఆ తర్వాత ఎంజైములను విడుదల చేసి కీటకాన్ని పూర్తిగా ద్రవంగా మార్చి జీర్ణం చేసుకుంటుంది.

పిచ్చర్ ప్లాంట్

పిచ్చర్ ప్లాంట్ ఆకులు ఒక కూజా ఆకారంలో ఉంటాయి. లోపల స్వీట్ ద్రవం ఉంటుంది. దాని వాసనకు ఆకర్షితులై వచ్చే కీటకాలు, చిన్న కప్పలు ఆ నునుపైన అంచుపై కాలు జారి నేరుగా లోపల ఉన్న జీర్ణ రసాల్లో పడిపోతాయి. అంచుల్లోంచి పైకి రాలేక ఊపిరాడక చనిపోతే.. ఆ మొక్క వాటిని జీర్ణం చేసుకుంటుంది.

సన్‌డ్యూ

ఈ మొక్క ఆకులపై మంచు బిందువుల్లా మెరిసే జిగురు చుక్కలుంటాయి. ఆ మెరుపును చూసి నీరు అనుకుని వచ్చే పురుగులు ఆ జిగురుకు అతుక్కుపోతాయి. పురుగు తప్పించుకోవడానికి ప్రయత్నించే కొద్దీ ఆకు చుట్టుకుపోయి మరింత గట్టిగా బంధిస్తుంది.

బ్లాడర్‌వార్ట్

ఇది ఎక్కువగా నీటిలో తేలియాడే మొక్క. దీనికి చిన్న చిన్న సంచుల వంటి బ్లాడర్లు ఉంటాయి. నీటిలోని చిన్న జీవులు దీని వాకిలిని తాకగానే, వాక్యూమ్ క్లీనర్‌లా సెకనులో వెయ్యో వంతు సమయంలో ఆ జీవిని లోపలికి లాగేసుకుంటుంది. భూమిపై అత్యంత వేగంగా వేటాడే మెకానిజం దీని సొంతం.

FAQ

ప్రశ్న: కీటకాహార మొక్కల గురించి మొదటిసారి పుస్తకం రాసింది ఎవరు?

జవాబు: చార్లెస్ డార్విన్ (1875లో Insectivorous Plants అనే పుస్తకం రాశారు).

ప్రశ్న: భారతదేశంలో పిచ్చర్ ప్లాంట్ సహజంగా ఎక్కడ కనిపిస్తుంది?

జవాబు: మేఘాలయలోని ఖాసీ కొండల్లో.

ప్రశ్న: ఈ మొక్కలు కిరణజన్య సంయోగక్రియ జరుపుతాయా?

జవాబు: అవును, వీటికి పత్రహరితం ఉంటుంది. ఆహారం తయారు చేసుకుంటాయి కానీ నైట్రోజన్ లోపం కోసమే జంతువులను తింటాయి.

Follow Us
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. మరో వందే భారత్‌ ఫిక్స్..
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. మరో వందే భారత్‌ ఫిక్స్..
వెంకీ కోసం ఏకంగా తండ్రితో గొడవ పడిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
వెంకీ కోసం ఏకంగా తండ్రితో గొడవ పడిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
టీవీకి బ్రేక్.. చదువుకు గ్రీన్ సిగ్నల్! AIతో తండ్రి స్కెచ్!
టీవీకి బ్రేక్.. చదువుకు గ్రీన్ సిగ్నల్! AIతో తండ్రి స్కెచ్!
ముందు వ్యాన్.. వెనుక బైక్.. అధికారులకు అనుమానమొచ్చి చెక్ చేయగా..
ముందు వ్యాన్.. వెనుక బైక్.. అధికారులకు అనుమానమొచ్చి చెక్ చేయగా..
ఉదయం లేవగానే వేడి నీళ్లు తాగుతున్నారా? ఆయుర్వేదం ఏం చెప్తోంది
ఉదయం లేవగానే వేడి నీళ్లు తాగుతున్నారా? ఆయుర్వేదం ఏం చెప్తోంది
ఎంత బిజీగా ఉన్నా ఆరోగ్యమే ముఖ్యం.. యశోద హాస్పిటల్స్ వేదికగా..
ఎంత బిజీగా ఉన్నా ఆరోగ్యమే ముఖ్యం.. యశోద హాస్పిటల్స్ వేదికగా..
ఎండలో కూర్చోవడం వల్ల విటమిన్ డి మాత్రమే కాదు.. ఎన్ని లాభాలో
ఎండలో కూర్చోవడం వల్ల విటమిన్ డి మాత్రమే కాదు.. ఎన్ని లాభాలో
తెలంగాణలో కొత్త పథకం ప్రారంభం.. ప్రతీ కుటుంబానికి రూ.5 లక్షలు..
తెలంగాణలో కొత్త పథకం ప్రారంభం.. ప్రతీ కుటుంబానికి రూ.5 లక్షలు..
నేను సూపర్ స్టార్ కావడానికి కారణం ఆయనే.. జీవితాంతం రుణపడి ఉంటాయి.
నేను సూపర్ స్టార్ కావడానికి కారణం ఆయనే.. జీవితాంతం రుణపడి ఉంటాయి.
అతనేం తప్పు చేశాడని తీసుకోలే గంభీర్.. ఇప్పుడు చూడు ఏం జరిగిందో..!
అతనేం తప్పు చేశాడని తీసుకోలే గంభీర్.. ఇప్పుడు చూడు ఏం జరిగిందో..!