అయోధ్యలో రామమందిరం రూపుదిద్దుకుంది. సెలబ్రిటీలతో పాటు సామాన్యులు అయోధ్య రామయ్య దర్శనానికి పోటెత్తుతున్నారు. అయితే ఇంకో అడుగు ముందుకేసి అయోధ్య రాములోరి సమక్షంలోనే పెళ్లిచేసుకుంటానంటున్నాడు ప్రముఖ హీరో. అతనే కన్నడ సినిమా ఇండస్ట్రీకి చెందిన రామ గౌడ. పేరుకు తగ్గట్టుగానే ఇతను రామ భక్తుడు. హీరోగా, దర్శకుడిగా రాణిస్తోన్న రామ గౌడ త్వరలోనే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్నాడు. ఐశ్వర్య అనే అమ్మాయితో కలిసి పెళ్లిపీటలెక్కనున్నాడు. ఇటీవల వీరి ఎంగేజ్‌మెంట్ ఎంతో అట్టహాసంగా జరిగింది. శివరాజ్‌కుమార్, ఉపేంద్ర తదితర స్టార్ హీరోలందరూ రామగౌడ- ఐశ్వర్య నిశ్చితార్థ వేడుకకు హాజరయ్యారు. కాబోయే వధూవరులను మనసారా ఆశీర్వదించారు. ఇదే సమయంలో తన పెళ్లిపై స్పందించిన రామ గౌడ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ‘నేను అపర రామభక్తుడిని. అందుకే అయోధ్యలో శ్రీరాములవారి సమక్షంలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఐశ్వర్య , నేను పదేళ్లుగా ప్రేమించుకుంటున్నాం. కెరీర్‌లో స్థిరపడ్డాకే జీవితంలో ముందడుగు వేయాలనుకుంటున్నాం. ఇప్పుడా సమయం ఆసన్నమైందని భావిస్తున్నాం’
‘ఇన్నాళ్లకు పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. దీంతో మా కుటుంబసభ్యులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఐశ్వర్య చాలా నిజాయతీగా ఉండే అమ్మాయి. నన్ను బాగా అర్థం చేసుకుంటుంది. నాకు సినిమాలతో పాటు బిజినెస్‌పై కూడా ఆసక్తి ఉంది. ఓ రెస్టారెంట్ బిజినెస్ రన్ చేస్తున్నాను. అటు సినిమాలు, ఇటు బిజినెస్ బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నాను. రాబోయే ఆరు నెలల్లో దర్శకుడిగా ఓ సినిమా కూడా ప్లాన్ చేస్తున్నాను. ఇది జరిగిన తర్వాత అంటే ఈ ఏడాది ఆఖరులో మేము అయోధ్య రాములోరి సమక్షంలో పెళ్లి చేసుకుంటాం’ అని రామ గౌడ చెప్పుకొచ్చాడు.
#ArunRamGowda Speaks about his Rabbit Racers in #RajCup6
Captain Of the Team #JayaKarthik
Vice Captain Of the Team @KaviratnaVNPFor more updates please Subscribe Our #AnandsportsIndia YouTube Channel https://t.co/sziHayOXMV #DRRajcup6 #AnandSportsIndia #AnandAudio pic.twitter.com/lOGuv0FEnZ
— AnandSportsIndia (@AnandSportsInd) November 8, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..