AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ramcharan: నాన్న అంటే భయమా? ఉపాసన అంటే భయమా?. సుమ ప్రశ్నకు చెర్రీ ఏం సమాధానమిచ్చాడో తెలుసా?

మెగాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఆచార్య (Acharya) మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మెగాస్టార్‌ చిరంజీవి (Megastar Chiranjeevi)తో పాటు ఆయన తనయుడు మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ (Ramcharan)ని కలిసి నటించడం

Ramcharan: నాన్న అంటే భయమా? ఉపాసన అంటే భయమా?. సుమ ప్రశ్నకు చెర్రీ ఏం సమాధానమిచ్చాడో తెలుసా?
Ramcharan
Basha Shek
| Edited By: Anil kumar poka|

Updated on: Apr 25, 2022 | 5:15 PM

Share

మెగాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఆచార్య (Acharya) మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మెగాస్టార్‌ చిరంజీవి (Megastar Chiranjeevi)తో పాటు ఆయన తనయుడు మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ (Ramcharan)ని కలిసి నటించడం, డైరెక్టర్‌గాఅపజయమెరుగని కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండడంతో ఈ మెగా మూవీపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్లే సినిమా నుంచి విడుద‌లైన పాటలు, టీజర్లు, ట్రైల‌ర్లు ఫ్యాన్స్‌ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఏప్రిల్‌ 29న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. చిత్రబృందంతో పాటు దర్శకధీరుడు రాజమౌళి ఈ వేడుకలో తళుక్కుమన్నారు. కాగా ఈ మెగా ఈవెంట్‌కు సుమ కనకాల (Suma Kanakala) హోస్ట్‌గా వ్యవహరించింది. ఎప్పటిలాగే తన మాటల గారడితో అందరినీ ఆకట్టుకుంది. వేడుకలో భాగంగా చిరంజీవి, రామ్‌చరణ్‌, కొరటాల శివలను సుమ సరదాగా కొన్ని ప్రశ్నలు అడిగింది. ప్రతిగా వారు కూడా అంతే ఫన్నీగా సమాధానాలిచ్చి ఆకట్టుకున్నారు.

అందరికీ అమ్మే బాస్‌.. కాగీ క్వశ్చన్‌ అండ్‌ ఆన్సర్స్‌లో భాగంగా చెర్రీని ఇరుకున పెట్టే ప్రశ్న వేసింది సుమ. ‘ఇంట్లో ఎవరికీ భయపడతారు? నాన్నకా? ఉపాసనకా? అని ఆమె అడగ్గా ..కొద్ది సేపు ఆలోచించిన రామ్‌చరణ్‌ తెలివిగా సమాధానం ఇచ్చాడు. ‘అమ్మ ముందు నాన్న జాగ్రత్తగా ఉంటారు. నేను కూడా అదే ఫాలో అవుతున్నాను.. ఉపాసన దగ్గర కాస్త జాగ్రత్తగా ఉంటాను. కల్యాణ్‌ బాబాయికైనా, డాడీకైనా, నాకైనా..మా అందరికీ బాస్‌ మా అమ్మే’ అంటూ ఉపాసనకే భయపడతానని చెప్పకనే చెప్పాడు చరణ్‌. కాగా చెర్రీ సమాధానం ఇస్తున్నప్పుడు ఉపాసన ముఖంలో నవ్వులు వెల్లివిరిశాయి. ఇక చరణ్‌ ఆన్సర్‌ విన్న చిరంజీవి ‘అది.. నన్ను చూసి బాగా నేర్చుకున్నావ్‌. సుఖపడతావ్‌. వాళ్లతో పెట్టుకోవద్దు.’ అని నవ్వుతూ చెప్పారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read:

Petrol Diesel Price: వాహనదారులకు కూల్.. కూల్ న్యూస్.. పైసా పెరగని పెట్రోల్, డీజిల్ ధరలు..

Childrens Care: తల్లిదండ్రులకు అలర్ట్.. మీ పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా ?.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..

Viral Video: ఒక రోజు ముందే వధూవరుల మధ్య ఆ పోటీ.. గెలిచిందెవరో తెలిస్తే షాక్..