Petrol Diesel Price: వాహనదారులకు కూల్.. కూల్ న్యూస్.. పైసా పెరగని పెట్రోల్, డీజిల్ ధరలు..
దేశంలో పెట్రోల్-డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. వరుసగా 19వ రోజు పెట్రోల్, డీజిల్ ధరలలో ఎటువంటి మార్పు లేదు. ఇది సామాన్యులకు కొంత ఉపశమనం కలిగించింది. ఎందుకంటే దీనికి ముందు ఏప్రిల్ 6 వరకు..
దేశంలో పెట్రోల్-డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. వరుసగా 19వ రోజు పెట్రోల్, డీజిల్ ధరలలో ఎటువంటి మార్పు లేదు. ఇది సామాన్యులకు కొంత ఉపశమనం కలిగించింది. ఎందుకంటే దీనికి ముందు ఏప్రిల్ 6 వరకు ఇంధన ధరలలో నిరంతర పెరుగుదల ఉంది. చివరిసారిగా ఏప్రిల్ 6న పెట్రోల్, డీజిల్ ధరలను 80-80 పైసలు పెంచారు. ఈరోజు తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ కొత్త ధరల్లో పెద్దగా మార్పులు లేవు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాల్లో ఈ రోజు పెట్రోల్-డీజిల్ ధరలు ఎలా పెరిగాయో.. తగ్గాయో తెలుసుకుందాం.. ఈ వివరాలను వెబ్ సైట్ అందించిన సమాచారం ప్రకారం పెట్రోర్, డీజిల్ ధరలు మీ కోసం..
క్రూడాయిల్ ధర..
ఈరోజు క్రూడాయిల్ ధరలు కనిపిస్తున్నాయి మరియు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు రెడ్ మార్క్‌లో కనిపిస్తోంది. నైమాక్స్ క్రూడ్ బ్యారెల్‌కు 2.40 డాలర్లు తగ్గి 99.67 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అదే సమయంలో, బ్రెంట్ క్రూడ్ ధర ఈ రోజు $ 103.92 వద్ద ఉంది మరియు బ్యారెల్‌కు $ 2.73 పడిపోయింది. ఈ ధరల ఆధారంగా ప్రభుత్వ చమురు సంస్థలు ఈరోజు ఉదయం 6 గంటలకు పెట్రోల్ మరియు డీజిల్ తాజా రేట్లను విడుదల చేశాయి, మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు.
తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.119.49గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.105.49గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.119.58గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.105.36గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 119.58గా ఉండగా.. డీజిల్ ధర రూ.105.55గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.120.62గా ఉండగా.. డీజిల్ ధర రూ.106.55గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 119.90 ఉండగా.. డీజిల్ ధర రూ.105.87గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.119 పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.105.02గా ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..
విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.120 ఉండగా.. డీజిల్ ధర రూ. 105.65గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.121.48లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.107.02గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 121.06గా ఉండగా.. డీజిల్ ధర రూ.106.68గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ.121.44లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.107.04లకు లభిస్తోంది.
దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు..
దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ.105.41 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 96.67లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.117.57కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.104.77 ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.115.12 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 99.83 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ.100.84ఉండగా.. డీజిల్ ధర రూ.100.94గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.111.09 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.94.79గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.30 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.88గా ఉంది.
మీ నగరంలో పెట్రోల్, డీజిల్ ధరలను SMS ద్వారా తెలుసుకోండి
మీరు ప్రతిరోజూ మీ నగరంలో పెట్రోల్ , డీజిల్ ధరలను SMS ద్వారా కూడా తనిఖీ చేయవచ్చు. ఇండియన్ ఆయిల్ (IOC) వినియోగదారులు RSP<డీలర్ కోడ్>ని 9224992249 నంబర్‌కు, HPCL (HPCL) వినియోగదారులు HPPRICE <డీలర్ కోడ్>ని 9222201122 నంబర్‌కు పంపవచ్చు. BPCL వినియోగదారులు RSP<డీలర్ కోడ్>ని 9223112222 నంబర్‌కు పంపవచ్చు.
ఇవి కూడా చదవండి: Viral Video: ఈ కాకి చాలా క్లెవర్.. ఒక్క ఐడియాతో దాని ఇంటినే మార్చేసింది.. ఏం చేసిందో తెలుసా..
Viral Video: ఒక రోజు ముందే వధూవరుల మధ్య ఆ పోటీ.. గెలిచిందెవరో తెలిస్తే షాక్..